Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
AP Police vs TS Police: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య సాగర్ పై ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
Nagarjuna Sagar Dam Water Dispute News: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ పోలీసులు డ్యామ్ మీద 13 గేట్ల వరకు చేరుకుని ముళ్ల కంచే ఏర్పాటు చేసి అక్కడివరకు డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే డ్యామ్ మీద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన కంచె, బారీకేడ్లను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు కౌంటర్ చర్యలు చేపట్టారు. సంబంధిత జిల్లా పోలీసులు జేసీబీలతో సాగర్ డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారని సమాచారం. ఏపీ పోలీసుల చర్యలకు, ప్రతిచర్యగా గురువారం రాత్రి తెలంగాణ పోలీసులు భారీగా సాగర్ డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. అయితే డ్యామ్ నిర్వహణ నీటిపారుదల సంబంధిత విషయమని, కంచెను తీసివేయాలని మిర్యాలగూడ డీఎస్సీ వెంకటగిరి ఏపీ పోలీసులను కోరినా ఏ ఫలితం కనిపించలేదు. మరోవైపు నిన్న రాత్రి ఏపీ అధికారులు సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దౌర్జన్యంగా విడుదల చేయడం తెలిసిందే.
బుధవారం అర్ధరాత్రి నుంచే హైడ్రామా..
నాగార్జున సాగర్ కుడి కాల్వ వద్ద బుధవారం రాత్రి నుంచే హైడ్రామా జరుగుతోంది. ఏపీ పోలీసులు ప్రాజెక్టు 26 గేట్లలో సగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందన్నారు. దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందితో బుధవారం అర్ధరాత్రి సాగర్ డ్యామ్ 13 గేట్ వరకు చేరుకుని ముళ్ల కంచె వేశారు. బారీకేడ్లను సైతం ఏర్పాటు చేయడంతో పాటు డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply