News
News
X

IT Raids : తెలంగాణలో మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు - అంతా గోప్యం !

తెలంగాణలో మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. వరుసగా ప్రముఖ కంపెనీల్లో సోదాలు చేస్తూండటంతో రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

FOLLOW US: 

IT Raids : తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భారీ భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఫీనిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నానక్ రామ్ గూడ, గోల్ఫ్ ఎడ్జ్ , మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లలో ఉన్న ఫీనిక్స్ కార్యాలయాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ముంబై నుంచి వచ్చిన 8 మంది ఐటీ అధికారుల బృందం విస్తృత సోదాలు చేసి, పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన మొత్తం 20 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి.

ఫోనిక్స్ గ్రూపు కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఫీనిక్స్ సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా సహా వివిధ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లాక్ బుక్స్ నిర్వహణకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారుల నుంచి ఐటీ అధికారులు సేకరించారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న లోన్స్.. ఆయా ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారా ? ఇతర కార్యకలాపాలకు దారిమళ్లించారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోదాలన్నీ పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !

వరుగా తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు 

ఇటీవలి కాలంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతలో పలు కంపెనీలపై ఇలా సోదాలు జరిగాయి. ఫీనిక్స్ కంటే ముందే వాసవి గ్రూప్‌పై ఎటాక్స్ చేశారు. పదుల సంఖ్యలో బృందాలతో ఒక్క సారిగా విరుచుపడిన ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు.  దాదాపుగా ఇరవై కంపెనీల పేర్లతో వాసవి గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. అనేక ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసింది. వీరి లావాదేవీలు వేల కోట్లలోనే ఉంటాయి. అయితే దానికి తగ్గట్లుగా పన్నులు చెల్లించడం లేదని.. అందుకే ఐటీ దాడులు చేశారని భావిస్తున్నారు. 

అమరావతి తీర్పుపై సుప్రీంకెళ్లబోతున్నాం - హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం !

రాజకీయ సంబంధాల కోణంలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయా ?

అక్కడ లభించిన ఆధారాలతోనే.. ఫీనిక్స్ పైనా దాడులు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఫీనిక్స్ గ్రూప్ చైర్మెన్  సురేష్ చుక్కపల్లి. ఫీనిక్స్ గ్రూప్ ప్రస్తుతం  దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన పెద్దలు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఐటీ దాడులు చేయించారని చెబుతున్నారు.మొత్తంగా తెలంగాణలో వరుసగా ఐటీ దాడులు జరుగుతూండటం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. 

Published at : 23 Aug 2022 05:37 PM (IST) Tags: IT attacks Telangana Phoenix group IT attacks on Phoenix

సంబంధిత కథనాలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

KCR Sand Art : కేసీఆర్ దేశ్ కీ నేత, పూరీ తీరంలో సైకత శిల్పం

KCR Sand Art : కేసీఆర్ దేశ్ కీ నేత, పూరీ తీరంలో సైకత శిల్పం

Revanth Reddy : ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, భారత్ జోడో యాత్రకు భయపడే కాంగ్రెస్ నేతలకు నోటీసులు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, భారత్ జోడో యాత్రకు భయపడే కాంగ్రెస్ నేతలకు నోటీసులు- రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!