అన్వేషించండి

Breaking News Live: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on January 19 Wednesday Breaking News Live: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి
బ్రేకింగ్ న్యూస్

Background

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను పీవీపీ అనుచరులు బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పీవీపీ అనుచరులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే శ్రుతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను కూడా పీవీపీ అనుచరుడు బాలాజీ, ఇంకొంత మంది ఆయన అనుచరులు జేసీబీతో కూల్చేయించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని నిలదీసినందుకు శ్రుతి రెడ్డిపై వారు బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. దీంతో పీవీపీతో పాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.

బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా గ్రాముకు రూ.2 తగ్గింది. కానీ వెండి ధర మాత్రం కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.300 పెరిగి రూ.65,800గా అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగానే ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,800గానే ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది నెలలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటుండగా.. నేడు (జనవరి 19) స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.17 పైసలు తగ్గి రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.08 పైసలు పెరిగి రూ.110.37గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.08 పైసలు పెరిగి రూ.96.44 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువే పెరిగింది. లీటరు ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.109.65 గా ఉంది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.95.74గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

15:54 PM (IST)  •  19 Jan 2022

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  కడెం నుంచి బోర్ణపల్లి వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

13:21 PM (IST)  •  19 Jan 2022

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించకపోవడంపై ఏపీ సీఎస్‌పై సుప్రీంకోర్టు ఫైర్

కోవిడ్19 బారిన పడి చనిపోయిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించనందుకు ఆంధ్రప్రదేశ్ మరియు బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నేటి మధ్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మరణాలకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ఇస్తుండగా.. ఏపీ, బిహార్‌లో ఎందుకు తక్కువగా చెల్లిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget