అన్వేషించండి

Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Background

ఓమిక్రాన్ అరంగేట్రంతో తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా గతంలో తరహాలో రాత్రి 9 గంటల తర్వాతి నుంచి ఉదయం వరకూ నైట్ కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులను పొడిగించారు. ఈ క్రమంలోనే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ సహా జనాలు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. నేడు (జనవరి 17) మధ్యా్హ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఉన్నందున రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.

ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం చర్యలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, కరోనా పరీక్షలు మరింత సంఖ్యలో చేయడం, వ్యాక్సిన్‌లు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పర్చడం వంటి చర్యలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనాథల సంక్షేమం, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు కరవుభత్యం, దళితబంధుకు నిధుల మంజూరు, వంటి అంశాలు అజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పొట్టేలు తల నరకబోయి మనిషి తల నరికి..
మదనపల్లె రూరల్ మండలం వలసపల్లెలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మద్యం మత్తులో ఉన్న తలారి.. పొట్టేలు అనుకుని ఓ వ్యక్తి తల నరికేశాడు. అక్కడ జరిగింది చూసిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. పొలిమేరలో గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. తలారి లక్ష్మణ్ కుమారుడు తలారి సురేష్‌(35) పొట్టేలును పట్టుకుని నిల్చున్నాడు. మరో తలారి చలపతి అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. బలిచ్చే సమయం కాగా, అంతా ఒకే అన్నారు. కానీ మద్యం మత్తులో ఉన్న తలారి చలపతి పొట్టేలు తలకు బదులుగా తలారి సురేష్ తలపై కత్తితో వేటు వేశాడు.  ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడ్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో ఉండటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

21:56 PM (IST)  •  17 Jan 2022

చింతామణి నాటక ప్రదర్శన నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

చింతామణి నాటక ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం పట్ల  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలని ఆర్యవైశ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 

19:29 PM (IST)  •  17 Jan 2022

సీపీఐ రామకృష్ణకు కరోనా పాజిటివ్

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం రామకృష్ణ స్వల్ప లక్షణాలతో హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని,  తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. 

17:11 PM (IST)  •  17 Jan 2022

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన 

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు  సీఎం కేసీఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

రేపు వరంగర్ లో జిల్లా  పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్  పర్యటించనున్నారు. అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసి పంటనష్టంపై వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తానే స్వయంగా పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలిస్తానని హామీఇచ్చారు. 

14:48 PM (IST)  •  17 Jan 2022

నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలున్నాయని వెల్లడి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలున్నాయని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని నారా లోకేష్ సూచించారు.

13:41 PM (IST)  •  17 Jan 2022

కడప మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

కడప రిమ్స్‌ మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయనున్న వైద్య విద్యార్థులు 150 మంది విద్యార్థులు పరీక్షలు చేయించుకోగా 50 మందికి పాజిటివ్ అని తేలింది కొందరు విద్యార్థుల ఫలితాలు రావాల్సి ఉంది. రేపటి పరీక్షలు వాయిదా వేయాలని ఎన్టీఆర్ వర్సిటీకి కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget