అన్వేషించండి

Breaking News Live: పెందుర్తి భూకబ్జా కేసు, వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live:  పెందుర్తి భూకబ్జా కేసు, వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు 

Background

ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

‘‘ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో దట్టమైన పొగ మంచు విస్తరిస్తోంది. ముఖ్యంగా విశాఖ నగరం దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పొగ మంచు విస్తరిస్తోంది. మారేడుమిల్లి నుంచి వస్తున్న మేఘాలు తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. మరో వైపున అనంతపురం, చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా అనంతపురం జిల్లా హిందూపురంలో 14.1 డిగ్రీలు నమోదయ్యింది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. గ్రాముకు రూ.20 పెరిగి పది గ్రాములకు రూ.200 చొప్పున ఎగబాకింది. వెండి ధర నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,600గా నిలకడగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,600గా ఉంది.

22:49 PM (IST)  •  04 Feb 2022

పెందుర్తి భూకబ్జా కేసు, వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు !

విశాఖ పెందుర్తి, సత్తివానిపాలెం భూకబ్జా వివాదంలో రెవిన్యూ ఉద్యోగులపై దాడి  దొడ్డి కిరణ్ గత వారం రోజుల క్రితం పరారయ్యాడు. ఎట్టకేలకు అతడ్ని పంజాబ్ అమృత్ సర్ లో విశాఖ పోలీసులు పట్టుకున్నారు. కిరణ్ ను దిల్లీ నుంచి విశాఖకు తీసుకొచ్చారు. అనంతరం పెందుర్తి స్టేషన్ కు తరలించారు. రేపు న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే భూకబ్జా కేసులో 4 గురిని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ తో పాటు పరారీలో ఉన్న డ్రైవర్ పవన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

18:23 PM (IST)  •  04 Feb 2022

ఈ నెల 9న విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు చినముషిరివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. 9వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. 

15:18 PM (IST)  •  04 Feb 2022

వేప‌ చెట్టుకు పాలు

తిరుప‌తిలోని స‌ప్త‌గిరి న‌గ‌ర్ లో వింత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి నుండి వేప‌ చెట్టుకు పాలు కారుతున్నాయి.. చెట్టు నుండి పాలు కారడాన్ని గుర్తించిన స్థానికులు వేపచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ వింత గురించి తెలుసుకున్న నగరవాసులు వేప‌చెట్టుకు పాలు కార‌డాన్ని చూసేందుకు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.. దేవుని మ‌హిమ వ‌ల్లనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయ‌ని, ఎగ‌బ‌డి మ‌రి పాల‌ను సేకరించి మొక్కుకుంటున్నారు స్థానికులు.

15:17 PM (IST)  •  04 Feb 2022

తిరుపతిలో వింత, వేప చెట్టుకు పాలు 

తిరుప‌తిలోని స‌ప్తగిరి న‌గ‌ర్ లో వింత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి నుంచి వేప‌చెట్టుకు పాలు కారుతున్నాయి. చెట్టు నుంచి పాలు కారడంను గుర్తించిన స్థానికులు వేపచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ వింత గురించి తెలుసుకున్న నగరవాసులు వేప‌చెట్టుకు పాలు కార‌డాన్ని చూసేందుకు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. దేవుని మ‌హిమ వ‌ల్లనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయ‌ని, ఎగ‌బ‌డి మ‌రి పాల‌ను సేకరించి మొక్కుకుంటున్నారు స్థానికులు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget