అన్వేషించండి

Breaking News Live: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేస్‌లు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేస్‌లు

Background

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

తెలంగాణకు భారీ పెట్టుబడి
తెలంగాణలో మరో ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఎలాంటి ప్లాంట్ లేని ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ .. తెలంగాణలో రూ. ఐదు వందల కోట్లతో ప్లాంట్ పెట్టాలని డిసైడయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.  తెలంగాణలో ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో రెండు దశల్లో మొత్తం రూ. ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు.  ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌ను భవిష్యత్‌లో పదిలక్షల లీటర్లకు పెంచుతారు. 

ఈ ప్లాంట్‌లో బట్టర్ మిల్క్, పెరుగు, లస్సి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో పాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తారు.  తెలంగాణ లో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అమూల్ ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రజలను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఉత్తర దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి.

తెలంగాణలో గురువారం (డిసెంబరు 30) వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్‌‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు. బుధవారం నాడు రాష్ట్రంలో నిజామాబాద్ సహా కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అటు విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా ఉంటున్నాయి. ఆంధ్రా కశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి తీవ్రంగానే ఉంది. ఏపీలోని అనంతపురంలో అత్యల్పంగా 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత జంగమేశ్వరంలో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంనట్లుగా అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.

13:16 PM (IST)  •  30 Dec 2021

ఏపీ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్

ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున కొన్ని విన్న‌పాలు చేసుకోవ‌డం జ‌రిగింది. అందులో మొద‌టగా థియేట‌ర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గౌర‌వ‌నీయులు వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిగారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్  తరపున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మిగ‌తా విన్న‌పాల ప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించి ఆదుకుంటార‌ని ఆశిస్తున్నామని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

12:27 PM (IST)  •  30 Dec 2021

పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు..

పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు రిజిస్టర్ అయింది. 21న కువైట్‌ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర ప్రకటించారు. 6వేల 856 మంది విదేశాల నుంచి వస్తే వాళ్లలో అంతా నెగిటివ్ వచ్చాకే స్వగ్రామలకు వచ్చారని తెలిపారు. వీరిలో 8 రోజులు గడిచాక 14 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అందులో ప్రత్తికోళ్ల లంకకు చెందిన 41 ఏళ్ల మహిళలు ఒమిక్రాన్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలించి.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు.

ఇంకా ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే 8010968295 నెంబర్‌కు చెప్పాలని సూచించారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర. వెంటనే ట్రేస్ చేసి, టెస్ట్ చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండగలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు కార్తికేయ మిశ్ర. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని... అందరూ విధిగా పాటించాలని రిక్వస్ట్ చేశారు. జిల్లాలో లక్షా 75వేల మంది 15-18 ఏళ్ల మధ్య పిల్లలు ఉన్నారని వాళ్లకు సోమవారం నుంచి టీకాలు వేస్తున్నట్టు ప్రకటించారాయన. 

10:40 AM (IST)  •  30 Dec 2021

రేణిగుంటలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి... ముగ్గురు పరిస్థితి విషమం

రేణిగుంట మండలం మామండూరు పరిధిలోని కుక్కల దొడ్డి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కడప తిరుపతి జాతీయ రహదారిపై కారు లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. వేగాన్ని అదుపు చేయలేక పోయిన కారు డ్రైవర్‌ ముందుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. వెనుకన వస్తున్న లారీ కూడా కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలానికి రేణిగుంట అర్బన్ పోలీసులు చేరుకొని గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. అందులో ముగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

10:11 AM (IST)  •  30 Dec 2021

మంత్రి పేర్ని నానితో ఆర్ నారాయణ మూర్తి భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంలో వివాదం నెలకొన్న వేళ ఆర్ నారాయణ మూర్తి.. మంత్రి పేర్ని నానిని కలిశారు. టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చిస్తున్నారు.

10:09 AM (IST)  •  30 Dec 2021

రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం

రేణిగుంట మండలం మామండూరు పరిధిలోని కుక్కల దొడ్డి వద్ద కడప తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ముందుగా వస్తున్న మరో లారీని ఢీ కొంది. దీంతో అదుపుతప్పి వెనకనున్న లారీ కూడా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలానికి రేణిగుంట అర్బన్ పోలీసులు చేరుకొని మిగతా ముగ్గురిని 108 వాహనంలో రుయా హాస్పిటల్ కు తరలించారు. అందులో ముగురు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget