అన్వేషించండి

Breaking News Live: కూనేపల్లిలో జల్లికట్టు.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తుల వాగ్వివాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: కూనేపల్లిలో జల్లికట్టు.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తుల వాగ్వివాదం

Background

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ పదో ఎడిషన్‌లో దాదాపు 6 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. నెక్టెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకూ ఈ మారథాన్ సాగుతోంది. 

ఈ మారథాన్ సందర్భంగా ఉదయం 5.30 నుంచే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్ - గచ్చిబౌలి మార్గంలో అన్ని ప్రధాన రహదారులను మూసి వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం కొండాపూర్ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న రాజేష్ భార్య నవ్య, తల్లి పద్మలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 19)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే కొనసాగుతోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.88గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.67 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.95గా ఉంది. ఇది రూ.0.62 పైసలు పెరిగింది.

ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.16 పైసలు తగ్గి రూ.110.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వెండి ధర కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,570 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,850 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,570 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,570 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100గా ఉంది.

14:43 PM (IST)  •  19 Dec 2021

కూనేపల్లిలో జల్లికట్టు.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తుల వాగ్వివాదం

తిరుపతి : సంక్రాంతి ముందే పోట్లగిత్తలు రంకెలేస్తున్నాయి. రామచంద్రాపురం(మం) కూనేపల్లిలో జల్లికట్టు నిర్వహించగా.. ఎద్దుల కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీ పడ్డారు. దీంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వాగ్వివాదం చోటుచేసుకుంది.

12:37 PM (IST)  •  19 Dec 2021

కోర్టు భవనాలు ప్రారంభించిన సీజేఐ

హన్మకొండ పర్యటనలో ఉన్న భారత ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జిల్లా కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ బుయాన్, రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావ్, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలిసి సీజేఐ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు.

10:28 AM (IST)  •  19 Dec 2021

భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

వరంగల్‌ జిల్లాలో నేడు రెండో రోజు జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యటిస్తున్నారు. భద్రకాళీ అమ్మవారిని జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేయి స్తంభాల గుడిని కూడా జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. నేడు హన్మకొండలో 10 కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ప్రారంభిస్తారు. 

09:03 AM (IST)  •  19 Dec 2021

ఏపీలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు చింతూరుకు చెందిన అన్నదమ్ములు గణేష్‌, సాయిగా గుర్తించారు. వీరు రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

08:56 AM (IST)  •  19 Dec 2021

హైదరాబాద్‌లో విపరీతంగా చలి

హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. సాయంత్రం నుంచే చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా చెట్లు అధికంగా ఉండే చోట్ల, శివారు ప్రాంతాల్లో చలి చాలా ఉంటోంది. ఆదిలాబాద్ కంటే ఇక్కడ తక్కువగా నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న చలి గాలులతో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Embed widget