అన్వేషించండి

Breaking News Live:హన్మకొండలో రోడ్డు ప్రమాదం...బైక్ ను ఢీకొన్న కారు  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on December 10 Friday Breaking News Live:హన్మకొండలో రోడ్డు ప్రమాదం...బైక్ ను ఢీకొన్న కారు  
ప్రతీకాత్మక చిత్రం

Background

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. నేడు జరుగుతున్న ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకుగానూ మొత్తం 37 పోలింగ్‌ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు ఓటు హక్కును విని‌యో‌గించు‌కోనున్నారు.

కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానా‌నికి స్థానిక సంస్థల కోటాలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణను వెబ్‌‌క్యా‌స్టింగ్‌ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. డిసెంబర్ 14న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమదే విజయమని అధికార టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఒక్క కరీంనగర్ జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ నేతలలో కొంత అమోమయం నెలకొంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ఓట్ల చీలికకు దారి తీస్తుందని జిల్లా నేతలు భావిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను 8 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. కరీంనగర్, హుజురాబాద్ జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిద్ధిపేట, హుస్నాబాద్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.  1324 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, టి.భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా, ఇండిపెండెంట్ గా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు.
Also Read: CDS Bipin Rawat Cremation: బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు.. నేడు అంత్యక్రియలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 115 మంది, ఖమ్మం రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 314 మంది పురుషులు, 454 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

20:32 PM (IST)  •  10 Dec 2021

హన్మకొండలో రోడ్డు ప్రమాదం...బైక్ ను ఢీకొన్న కారు  

హన్మకొండ జిల్లా బాలసముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. బస్టాండ్ నుంచి సుబేదారి వైపు వెళ్తున్న కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. 

19:26 PM (IST)  •  10 Dec 2021

గుంటూరు జిల్లాలో విషాదం... కృష్ణా నదిలో ఆరుగురు గల్లంతు

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు అయ్యారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు నదిలో గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget