Case against Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు - గిరిజనుల భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు !
Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదయింది. తమ భూమిని కబ్జా చేశారని గిరిజనులు ఫిర్యాదు చేశారు.
Case against Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేశారు. కుట్రతో మోసగించి భూమిని కాజేసారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన షామీర్ పేట పోలీసులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో పాటు మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త సహా మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.
చదువు రాదని తెలిసి రూ. 3 లక్షలు ముట్టచెప్పి భూమి కొట్టేశారు !
బాధితుడు కేతా వత్ బిక్షపతి నాయక్ వారసత్వంగా వచ్చిన భూమి ఆరుగురిపై ఉందన్నారు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనాకాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి హరిమోహన్ రెడ్డి , మధుకర్ రెడ్డి , శివుడు , స్నేహరామిరెడ్డి రామిలి, లక్ష్మమ్మ , రామిడి నేహా రెడ్డిలు మాకు మాయ మాటలు చెప్పి కుట్రతో మమ్మల్ని నమ్మించి మీ భూమి మీకు వస్తుందని ఆశ చూపి మమ్మల్ని నమ్మించి అబద్ధాలు చెప్పి ని నిరక్ష్య రాస్యులైన మాతో రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడ్డారన్నారు. ఆరోజు మాకు ఏడు మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చారన్నారు.
ఎన్నికలకు ముందు హడావుడిగా రిజిస్ట్రేషన్
అధికార పార్టీ అండతో మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమి నీ మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేశారని వారు ఆరోపించారు. తాసిల్దార్ వాణి రెడ్డి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాకు ఎలాంటి సమాచారం చెప్పకుండా అప్పటి మల్లారెడ్డి డబ్బు సంచులకు కక్కుర్తి పడి మాభూమిని మల్లారెడ్డికి దార దత్తం చేసిందని తాసిల్దార్ వాణి రెడ్డి పై దుమ్మెత్తి పోశారు భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసి 20 లక్షలకు అమ్ముడు పోయిందని వారు ఆరోపించారు. మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మూడు చింతల పల్లి తాసిల్దార్ వాణి రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కబ్జాపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి
తాము నిరుపేదలమని ఈ భూమి కబ్జాపై విచారణ చేపట్టాలని బాధితులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు 9 మంది బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మా భూమి పై కుట్ర చేసి మాకు తెలియకుండానే 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల మా భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతని పార్టీ అనుచరులు 9 మందిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి కుట్రతో భూమిని కాజేసిన 9 మంది పై జ్యుడీషియల్ విచారణ చేపట్టి మా భూమిని మాకు అప్పగించాలని బాధితుడు కేతావత్ బిక్షపతి వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా విన్నవించారు.