News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ganesh Laddu 46 Lakh: బాలాపూర్ లడ్డూ రికార్డు బ్రేక్, రూ. 46 లక్షలు పలికి మరకట లడ్డూ!

Ganesh Laddu 46 Lakh: మరకట గణేషుడి లడ్డూ బాలాపూర్ లడ్డు రికార్డును బద్ధలు కొట్టి రూ. 46 లక్షలు పలికింది. దీన్ని బ్రేక్ చేస్తూ బండ్లగూడలోని కీర్తి రిచమండ్ విల్లాస్ గణేష్ లడ్డూ రూ.6.8 లక్షలు పలికింది.

FOLLOW US: 
Share:

Ganesh Laddu 46 Lakh: గణేష్ లడ్డూ వేలం అనగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో నగరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూను వేలం వేయడాన్ని మొదట ప్రారంభించింది అక్కడే. మొదట కొంత మొత్తం ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ.. బాలాపూర్ లడ్డూ వేలం ధర వేలు, 10 వేలు, లక్షలు దాటి పదుల లక్షల్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం దాని రికార్డును అదే బద్దలు కొట్టుకుంటోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు తమకు చాలా మంచి జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. అది వారికి, వారి కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు మేలు జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది. బాలాపూర్ లడ్డూను ఎలాగైన సొంతం చేసుకోవాలన్న కాంక్ష పెరిగి పోయింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు సైతం వెచ్చించడానికి వెనకాడటం లేదు. 

ఈ ఏడాది రికార్డు స్థాయిలో లడ్డూ ధర..

ఎన్నడూ లేనంత ఎక్కువ మొత్తంలో ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ. 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూ వేలం వేయడం ఇదే ప్రప్రథమం. ఇదే రికార్డు అని అంతా అనుకున్నారు. కానీ అంతకుమించి అత్యధిక ధరను సొంతం చేసుకుంది మరకట గణేష్. బాలాపూర్ గణేష్ రూ. 24.60 లక్షలు అయితే.. మరకట గణేషుడి లడ్డూ ఏకంగా.. రూ. 46 లక్షలు పలికింది. 

బాలాపూర్ రికార్టును బద్దలు కొట్టిన మరకట లడ్డూ..

హైదరాబాద్ శివారు అల్వాల్ సర్కిల్ వద్ద మరకట శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా జరిగాయి. ఆఖరి రోజూ లడ్డూ వేలం పాట పాడారు. వేలంలో ఏకంగా రూ. 46 లక్షలు పలికింది. గీత ప్రియ వెంకటరావు దంపతులు.. ఈ ఏడాది మరకట గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కూడా గీత ప్రియ వెంకటరావులే మరకట గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం మరకట గణపతి లడ్డూ వేలం పాటలో సొంతం చేసుకోవడంతో.. ఆ దేవుని కటాక్షం సిద్ధించిందని గీతప్రియ వెంకటరావు దంపతులు తెలిపారు. అందుకే మరోసారి మరకట గణేష్ లడ్డూ సొంతం చేసుకోవాలని అనుకున్నట్లు వారు వివరించారు. ఈ సారి ఎంత ధర అయినా పలికి మరకట గణేషుడి లడ్డూ సొంతం చేసుకుందామని ముందే అనుకున్నట్లు వాళ్లు వెల్లడించారు.  ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ. 24.60 లక్షలు కాగా.. మరకట గణపతి లడ్డూ రూ. 46 లక్షలు పలకడం రికార్డు. 

అయినా.. బాలాపూరే ఫేమస్..

బాలాపూర్ లడ్డూ కంటే అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఒక ఏడాది భారీ ధర సొంతం చేసుకోవడం ఆ తర్వాతి ఏడాది మామూలు ధరకు ఇతరులు వేలం పాడటంతో ఆయా గణేషుల లడ్డూలు పెద్ద ప్రాముఖ్యత రాలేదు. కానీ బాలాపూర్ గణేష్ లడ్డూ మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

దీన్ని కూడా బ్రేక్ చేసిన బండ్లగూడలోని మరో లడ్డూ..

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని గణేష్ లడ్డూ రికార్డు స్థాయి ధరను పలికింది. కీర్తి రిచమండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ రూ.60.8 లక్షలు పలికింది. 

Published at : 11 Sep 2022 08:12 PM (IST) Tags: Hyderabad News Ganesh Laddu 46 Lakh Alwal Marakata Laddu Ganesh Laddu Auctioned Ganesh Laddu

ఇవి కూడా చూడండి

Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్

Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Hyderabad News: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం, మరోచోట ఆటో వదిలి పరారైన దుండగులు! అసలేం జరిగింది!

Hyderabad News: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం, మరోచోట ఆటో వదిలి పరారైన దుండగులు! అసలేం జరిగింది!

టాప్ స్టోరీస్

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే