అన్వేషించండి
Advertisement
KCR News: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
ప్రత్యేక విమానంలో అఖిలేష్ యాదవ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అందుకోసం ఆయన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ కు వచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు అఖిలేష్ కు సాదర స్వాగతం పలికారు.
తొలుత లఖ్‌నవూ నుంచి ప్రత్యేక విమానంలో అఖిలేష్ యాదవ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేసీఆర్ వారికి మధ్యాహ్నం భోజన ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి తదితరులున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement