Telangana: ప్రొఫెసర్స్ పదోన్నతుల్లో అవకతవకలు, ABVP OU ఆధ్వర్యంలో గవర్నర్ కు లేఖ
ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని కొందరు గవర్నర్ కు లేఖ రాశారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అయినా వీటిపై వర్సిటీ వైఎస్ ఛాన్స్ లర్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఏబీవీపీ ఓయు శాఖ మండిపడింది. ఎలాగైనా ఈ పదోన్నతులపై విచారణ జరిపించి, తప్పు అని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ABVP OU శాఖ అధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించి యూనివర్సిటీస్ ఛాన్సలర్ కి బహిరంగ లేఖ విడుదల చేశారు.
లక్షలు చెల్లిస్తేనే పదోన్నతలు..
ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ గా అర్హత కావాలంటే వారికి యూజీసీ నుంచి 10 ఆర్టికల్స్ జర్నల్స్ పబ్లిష్ అయి ఉండాలి. ఆ తరువాత ప్రొఫెసర్ కింద ఇద్దరు PhD పట్టాలు పొంది ఉండాలి. కానీ ఈ రూల్స్ ను తుంగలో తొక్కుతూ.. అర్హత లేని ప్రొఫెసర్స్ కి సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి ఇవ్వడం చాలా దుర్మార్గం అన్నారు. వీటిపై వీసీ సమగ్ర విచారణ, లేక పరిశీలన చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈరోజు ఉస్మానియాటిలో సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి పొందాలంటే VC కి లక్షల లక్షల రూపాయల ముడుపులు చెల్లించవలసిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఈరోజు అర్హత కలిగిన ప్రొఫెసర్స్ ని వదిలేసి అనర్హత కలిగిన ప్రొఫెసర్ కి సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి ఇవ్వడం చాలా బాధాకరం అన్నారు. ఈ సమస్యపై యూనివర్సిటీకి ఛాన్స్ లర్ అయిన గవర్నర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యూనివర్సిటీస్ ఛాన్స్ లర్ అయిన గవర్నర్ కి బహిరంగ లేఖ విడుదల చేసి తెలియచేస్తున్నాం.
ఇప్పటికైనా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే అర్హత కలిగిన ప్రొఫెసర్ కి సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి ఇవ్వాలని కోరారు. ఎవరైతే తప్పుడు ప్రక్రియలో సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి పొందిన వ్యక్తులను వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి శిక్షించాలని, అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు విద్యానగర్ విభాగ కన్వీనర్ పృథ్వి తేజ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ కమల్ సురేష్, సుమన్ శంకర్, అలివేలి రాజు, తెలంగాణ స్టేట్ అల్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ గణేష్, యూనివర్సిటీ సెక్రెటరీ పరుశురాం, స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ దృహన్, యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సాయి, విద్యార్థినాయకులు శివ, సాయినాథ్, మని, తదితరులు పాల్గొన్నారు.