By: ABP Desam | Updated at : 19 Jan 2022 09:09 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల వ్యవధిలో 1,11,178 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మెుత్తం..7,18,196కు చేరాయి. వైరస్ కారణంగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెుత్తం 4,065 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వైరస్ బారి నుంచి కొత్తగా 1,773 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మరోవైపు రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదుకాగా 441 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చెరింది. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది.
1,88,157 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.83గా ఉంది.
రాష్ట్రాలవారీగా..
మహారాష్ట్రలో కొత్తగా 39,207 కరోనా కేసులు నమోదయ్యాయి. 53 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దిల్లీలో కొత్తగా 11,684 మందికి కరోనా సోకింది. 38 మంది మృతి చెందారు. దిల్లీ పాజిటివిటీ రేటు 22కు తగ్గింది.
గుజరాత్‌లో కొత్తగా 17,119 కరోనా కేసులు నమోదయ్యాయి.
జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 4,651 మందికి కరోనా సోకింది ముగ్గురు మృతి చెందారు.
అసోంలో ఒక్కరోజులో 8,072 కేసులు నమోదయ్యాయి. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి అసోంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 158 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
Also Read: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..
Also Read: Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు
Also Read: CS Sameer Sharma: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!