Youtube Premium Lite subscription: యూట్యూబ్ యాడ్స్‌తో బోర్ కొడుతోందా! ప్రీమియం లైట్ వెర్షన్ ప్రారంభం.. ధర, ఫీచర్లు ఇవే
Youtube Premium Lite subscription in India | ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. తక్కువ ధరలో ప్రకటనలు లేకుండా చాలా వరకు వీడియోలు చూడవచ్చు.

Youtube Premium Lite launched in India | భారతదేశంలో ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను యూట్యూబ్ ప్రారంభించింది. ఇది తక్కువ ధరతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, దీని ద్వారా నెటిజన్లు చాలా వీడియోలను ప్రకటనలు లేకుండా చూడవచ్చు. ఈ యూబ్యూబ్ ప్రీమియం లైట్‌ను ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది వినియోగదారులకు YouTubeలో చాలా వీడియోలను ప్రకటనలు లేకుండా చూసే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో మీరు సబ్‌స్క్రిప్షన్ తీసుకుని లిమిటెడ్ యాడ్స్ తో వీడియోలు చూసేయండి. YouTube మ్యూజిక్, ప్రీమియం 125 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉండగా కంపెనీ ఈ ప్రకటన చేసింది.
సబ్‌స్క్రిప్షన్ ధర ఎంత?
YouTube ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు 89 రూపాయలు చెల్లించాలి. ఇది మొబైల్, ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీతో సహా అన్ని పరికరాల్లో పనిచేస్తుంది. అయితే ఈ ప్లాన్ పూర్తిగా ప్రకటన రహితం (Ad-Free) కాదు. మ్యూజిక్ కంటెంట్, షార్ట్స్ చూసేటప్పుడు, వినియోగదారులు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు లేదా బ్రౌజ్ చేసినప్పుడు ప్రకటను వస్తాయని కంపెనీ తెలిపింది. ఇది చవకైన ప్లాన్ అని, ఇది సాధారణ వీడియోలు ప్లే అవుతున్న సమయంలో ప్రకటనలను తొలగిస్తుందని చెప్పండి. ప్రస్తుతం కంపెనీ దీన్ని దశలవారీగా విడుదల చేస్తోంది. అందరు వినియోగదారులకు ప్రీమియం లైట్ ఫీచర్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
లైట్ వెర్షన్ ప్రీమియం నుంచి భిన్నంగా ఎలా ఉంటుంది?
ప్రీమియం లైట్ కంపెనీకి చెందిన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నుంచి పలు విధాలుగా భిన్నంగా ఉంటుంది. వీటి మధ్య మొదటి వ్యత్యాసం ధర. ప్రీమియం లైట్ వెర్షన్ కోసం, వినియోగదారులు నెలకు 89 రూపాయలు చెల్లించాలి, అయితే ప్రీమియం కోసం నెలకు 149 రూపాయలు కట్టాలి. లైట్ వెర్షన్‌లో సాధారణ వీడియోలలో ప్రకటనలు కనిపించకపోగా, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఏ వీడియోలోనూ యాడ్స్ కనిపించవు. అంతేకాకుండా, లైట్ వెర్షన్‌లో వినియోగదారు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, YouTube మ్యూజిక్ ప్రీమియంను యాక్సెస్ చేయలేరు. ప్రీమియం వెర్షన్‌లో ఈ ఫీచర్‌లు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో, YouTubeలో లాంగ్-ఫార్మ్ వీడియోలను ఎక్కువగా చూసే వినియోగదారులకు లైట్ వెర్షన్ తో ప్రయోజనం ఉంటుంది. మీకు డౌన్‌లోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, మ్యూజిక్ స్ట్రీమింగ్ అవసరమైతే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం బెటర్ అని కంపెనీ సూచించింది.






















