By: ABP Desam | Updated at : 21 Aug 2023 04:42 PM (IST)
Photo Credit: Pixabay
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ వినియోగదారులకు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఈ ఏడాది(2023) డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా హెచ్చరిక మెసేజ్ ను పంపించింది. గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కు ఇన్ యాక్టివ్ పరిమితిని 2 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. అంటే, వినియోగదారులు రెండు సంవత్సరాల పాటు గూగుల్ అకౌంట్స్ వినియోగించకపోతే లేదంటే యాక్టివ్ గా ఉంచకపోతే వాటిని పర్మినెంట్ గా తొలగిస్తుంది. అయితే, నేరుగా గూగుల్ అకౌంట్ కి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసుల కోసం గూగుల్ అకౌంట్ ను వినియోగిస్తారో వారికి ఈ తొలగింపు ఉండదని వెల్లడించింది.
గూగుల్ వినియోగదారులు గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కాకుండా, గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసులను సైతం వినియోగించకుండా రెండు ఏండ్ల పాటు కొనసాగిస్తే అలాంటి అకౌంట్లు కూడా ఎగిరిపోతాయని హెచ్చరించింది. అయితే, గూగుల్ అకౌంట్ డిలీట్ చేయడానికి సుమారు 8 నెలల ముందు నుంచే వార్నింగ్ మెయిల్స్ పంపనున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ వార్నింగ్ మెయిల్స్ ను కూడా పట్టించుకోకపోతే అప్పుడు సదరు అకౌంట్లను శాశ్వతంగా తొలగిస్తామని తెలిపింది. ఒకసారి గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తే, అదే పేరుతో మళ్లీ కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవడం సాధ్యం కాదని తెలిపింది. అందుకే గూగుల్ అకౌంట్స్ డిలీట్ కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు లాగిన్ కావడం మంచిదని తెలిపింది.
రీసెంట్ గా గూగుల్ భారత్ లో గూగుల్ వన్ సబ్ స్క్రైబర్లకోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు డేటాను సేఫ్ గా ఉంచుకోవచ్చు. బ్రౌజింగ్ డేటాను కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవచ్చు. సదరు వినియోగదారుల వ్యక్తిగత వివరాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి చిక్కకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది.
Read Also: గుడ్ న్యూస్ చెప్పిన JIO, ఇకపై ఈ ప్లాన్లకూ ఫ్రీగా Netflix సబ్‌స్క్రిప్షన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
/body>