అన్వేషించండి

Sanchar Saathi App : ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది

Sanchar Saathi App:పల్లెల్లో మొబైల్ నెట్‌వర్క్‌ సమస్యలు అదిగమించేందుకు జియో, ఎయిర్‌టెల్,బీఎస్‌ఎన్‌ఎల్‌ ఐక్యమయ్యాయి. వినియోగదారుడికి ఆటోమేటిక్‌గా ఆయా నెట్‌వర్కుల రోమింగ్ అయ్యేలా యాప్ క్రియేట్ చేశారు.

Sanchar Saathi App : సైబర్‌ (Cyber)దాడులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో  వినియోగదారులకు సురక్షితమైన సేవలు అందించే ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచార్‌సాథీయాప్‌ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పోర్టల్‌ద్వారా సేవలు అందిస్తుండగా..ఇప్పుడు యాప్‌(Mobile App) అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల ఫోన్‌లకు వచ్చే అనుమానితుల, మోసపూరితస సంభాషణలు, వాణిజ్య  సంస్థల నుంచి వచ్చే అనవసరపు  కాల్స్‌ను ఈ యాప్‌ ద్వారా ముందుగానే పసిగట్టవచ్చు. అలాగే మనకు తెలియకుండా మన పేరిట ఎవరైన సిమ్‌ తీసుకుని వాడుతున్నట్లయితే ఈ విషయాన్ని యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
 
 
మొబైల్‌ ఫోన్ పోయినా...ఎవరైనా కొట్టేసినా యాప్‌ ద్వారా ఆ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. ఎంతో ఆదరణ పొందుతున్న ఈ పోర్టల్‌ను  రోజుకు 3లక్షల మంది వినియోగిస్తున్నారు. అలాగే సైబర్‌ నేరాలకు,ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న  25 లక్షల హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేశారు.12.38 లక్షల వాట్సప్ ఖాతాలు తొలగించడమేగాక, అనుమానిత మొబైల్ నెంబర్లతో అనుసంధానమైన 11 లక్షల బ్యాంకు ఖాతాదారులపై చర్యలు చేపట్టారు. చోరీకి గురైన 25 లక్షల ఫోన్లను బ్లాక్ చేయగా.. 15 లక్షల ఫోన్లను గుర్తించారు. సంచార్ సాథీ పోర్టల్ విజయవంతం కావడంతో ఇప్పుడు మొబైల్ యాప్‌ తీసుకొచ్చారు.
Image
 
సిగ్నల్ సమస్యలకు చెల్లు చీటీ
నగరాలు,పట్టణాల్లో  5జీ స్పీడ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని పల్లెలు,మారుమూల గ్రామాల్లో కనీసం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ (Phone Signals)అందడం లేదు. మాటలు వినిపించకపోవడం, ఇంటర్‌నెట్‌(Internet) రాకపోవడం నిత్యకృత్యమే. ఎన్ని సర్వీస్ ప్రొవైడర్లను మార్చినా...అందరిదీ అదే తంతు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు టెలికం సంస్థలు ముందుకొచ్చాయి. టెలికం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో(JIO)తోపాటు ఎయిర్‌టెల్‌(Airtel)తో ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)ఈమేరకు ఒప్పందం చేసుకుంది.
 
ఈ మూడు కంపెనీలకు చెందిన ఏ వినియోగదారుడైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లగానే  అక్కడ సిగ్నల్ బాగా ఉన్న ఇతర నెట్‌వర్క్‌తో రోమింగ్ సౌకర్యం ఏర్పడుతుంది. దీంతో ఇక నెట్‌వర్క్‌(Network) సమస్యే ఉండదు. పైగా టెలికం కంపెనీలు సైతం అన్ని ప్రాంతాల్లో తమ టవర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఒప్పందం అటు వినియోగదారులకు, ఇటు టెలికం సంస్థలకు ఎంతో లాభదాయకంగా  ఉండనుంది.
 
గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్ వాడేవారు తమ నెట్‌వర్క్ సిగ్నల్స్‌ సరిగా లేకుంటే ఆటోమేటిక్‌గా జియో, ఎయిర్‌టెల్‌ టవర్ల నుంచి సిగ్నిల్స్ తీసుకుంటుంది. దీంతో వినియోగదారుడు పదేపదే సిగ్నల్స్ సమస్యతో ఇతర నెట్‌వర్కులకు మారకుండా సిగ్నల్స్ సమస్యలకు చెక్‌ పెట్టనున్నారు. జియో(Jio) సంస్థకు దేశవ్యాప్తంగా 35,400 టవర్లు ఉండగా ఏపీ సర్కిల్‌లో 3,715 ఉన్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL)కు దేశవ్యాప్తంగా 20,513 టవర్లు ఉండగా ఏపీలో 1370 ఉన్నాయి. ఎయిర్‌టెల్‌(Airtel0కు దేశవ్యాప్తంగా 2,038 టవర్లు ఉండగా మన దగ్గర 197 ఉన్నాయి. ఇప్పుడు ఈ టవర్లు ద్వారా ఈ మూడింటిలో ఏ నెట్‌వర్క్‌కు అయినా సిగ్నల్స్‌ ఆటోమేటిక్‌గా  వినియోగదారుకి చేరనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలకు చెక్‌పడనుంది.
 
నాణ్యమైన సేవలు
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు..మొబైల్ టవర్ ప్రాజెక్ట్‌ల నెట్‌వర్క్‌ పెంచేందుకు ప్రభుత్వ టెలికం సంస్థ డిజిటల్ భారత్‌ నిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మొబైల్‌ సేవలు అందుకోలేకపోతున్న మారుమూల గ్రామ ప్రజలకు ఈ సేవలు అందించడమే దీని ముఖ్యఉద్దేశం. పల్లెవాసులకు ఈ-గవర్నెన్స్‌, విద్య,ఆరోగ్య సంరక్షణ,ఆర్థికవృద్ధి వంటి ముఖ్యమైన సేవలు అందిచడమే డిజిటల్ భారత్‌ నిధి ముఖ్య ఉద్దేశం.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Embed widget