అన్వేషించండి

Ssmartphone Chargers Colour: స్మార్ట్ ఫోన్ చార్జర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ఆ ఆసక్తికర విషయం మీకు తెలుసా

Smartphone Charger White in Colour: ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ భాగమై పోతోంది. అయితే స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఛార్జర్లు తెల్లగా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా మీరు ఆలోచించారా. ఈ విషయం తెలుసుకోండి.

Smartphone Charger White in Colour: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. దాదాపు అన్ని కంపెనీల ఛార్జర్‌లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయని మీరు గమనించే ఉంటారు. చాలా తక్కువ కంపెనీ బ్రాండ్‌లు మాత్రమే నలుపు లేదా ఇతర రంగు ఛార్జర్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు ఎక్కువగా తెలుపు రంగులో ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దాదాపు ఎవరికీ తెలియదు.

తెలుపు రంగును ఎందుకు ఎంచుకుంటారు?

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్‌ను తెలుపు రంగులో తయారు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుపు రంగు శుభ్రంగా, ప్రీమియం రూపాన్ని ఇస్తుందని కంపెనీలు నమ్ముతాయి. తెలుపు రంగు దూరం నుండి కొత్తగా, బెటర్‌గా కనిపిస్తుంది. ఇది వినియోగదారులపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆపిల్ వంటి కంపెనీలు తమ ఛార్జర్‌లు, కేబుల్‌లను ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉంచుతాయి.

మురికి, డ్యామేజీ త్వరగా కనిపిస్తాయి

తెలుపు రంగుపై కొద్దిగా మురికి, గీతలు లేదా కాలిన గుర్తులు ఉన్నా మనకు వెంటనే కనిపిస్తాయి. దీని వలన ఛార్జర్ చెడిపోతోందని లేదా ఏదైనా సమస్య ఉందని వినియోగదారులకు ఈజీగా తెలుస్తుంది. ఇది ఒక రకమైన భద్రతా సంకేతం కూడా అని కంపెనీలు భావిస్తాయి. నలుపు లేదా ముదురు రంగు ఛార్జర్‌లలో మురికి  దాగి ఉంటుంది. దాంతో వైర్లు డ్యామేజీ అయినా, ఏదైనా కాలిపోయినట్లు ఉన్నా వినియోగదారులు ఆ ఛార్జర్లు వాడితే ప్రమాదాన్ని ముందుగా గుర్తించలేరు.

ఉత్పత్తి, ఖర్చులో సౌలభ్యం

తెలుపు రంగు ప్లాస్టిక్‌ను తయారు చేయడం కంపెనీలకు చాలా సులువు, ఈ ప్రాసెస్ చౌకగా ఉంటుంది. ఛార్జర్‌లను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ తెలుపు రంగులో సులభంగా అచ్చు వేయవచ్చు. దీనికి అదనపు రంగులు వేయాల్సిన అవసరం లేదు. అందుకే తెలుపు ఛార్జర్లను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడం తేలిక, ఈ విధానం కంపెనీలకు చవకగా ఉంటుంది.

తెలుపు రంగు, హీట్ మేనేజ్‌మెంట్

ఛార్జింగ్ సమయంలో ఛార్జర్‌లో కచ్చితంగా వేడి ఉత్పత్తి అవుతుంది. తెలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహించదు. అయితే నలుపు లేదా ముదురు రంగు ఉత్పత్తులు వేడిని త్వరగా గ్రహిస్తాయి. అందుకే ఛార్జర్‌ను చల్లగా ఉంచడానికి తెలుపు రంగు సహాయపడుతుంది. దాంతోపాటు ఛార్జర్ లైఫ్ టైమ్ పెంచుతుంది.

బ్రాండింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ

తెలుపు రంగు శాంతి, సరళత, నమ్మకానికి చిహ్నంగా పరిగణిస్తారు. కంపెనీలు దీనిని తమ బ్రాండింగ్‌లో భాగంగా చేసుకోవడానికి ఇది ఒక కారణం. ముఖ్యంగా ఆపిల్ తెలుపు ఛార్జర్‌లు, కేబుల్‌లను ఒక రకమైన ప్రమాణంగా తీసుకుని తయారుచేస్తుంది. ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి, తద్వారా వారి ఉత్పత్తి మరింత ఆకర్షణీయంగా, యూజర్లకు నమ్మదగినదిగా కనిపిస్తుందని కంపెనీలు భావిస్తాయి.

నలుపు రంగు, ముదురు రంగు ఛార్జర్‌లు మంచిది కాదా?

నలుపు లేదా ఇతర రంగు ఛార్జర్‌లు మంచివి కావని కాదు. కానీ వినియోగదారులకు ప్రీమియం, చాలా బ్రాండ్‌లు ఇప్పుడు వివిధ రంగుల ఛార్జర్‌లను కూడా విడుదల చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికీ తెలుపు రంగుకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎందుకంటే ఇది చవకైనది, ఈజీగా చేయవచ్చు. వినియోగదారులు చార్జర్ డ్యామేజీని ఈజీగా గుర్తించవచ్చు. వేడిని తక్కువగా గ్రహిస్తుందని తెలుగు రంగు ఛార్జర్స్ ను యూనివర్సల్‌గా పరిగణిస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget