Whatsapp Undo Delete: Delete For Everyone నొక్కబోయి Delete For Me ప్రెస్ చేస్తున్నారా - అయితే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ మీకోసమే!
వాట్సాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే Undo Message Delete ఫీచర్.
![Whatsapp Undo Delete: Delete For Everyone నొక్కబోయి Delete For Me ప్రెస్ చేస్తున్నారా - అయితే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ మీకోసమే! Whatsapp Undo Delete Message Feature Reportedly in Works Check Details Whatsapp Undo Delete: Delete For Everyone నొక్కబోయి Delete For Me ప్రెస్ చేస్తున్నారా - అయితే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ మీకోసమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/17/db66cf92016789ae892e0959f099418c_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన బెస్ట్ యూజ్‌ఫుల్ ఫీచర్లలో మెసేజ్ డిలీషన్ ఫీచర్ ఒకటి. మీరు పొరపాటున ఒకరికి పంపబోయిన మెసేజ్ మరొకరికి పంపితే ఆ మెసేజ్‌ను ‘Delete For Everyone’ ద్వారా డిలీట్ చేయవచ్చు. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడింది. అయితే కొంతమంది Delete For Everyone నొక్కబోయి Delete For Me నొక్కుతారు. అలాంటి సందర్భంలో ఏమీ చేయడానికి ఉండదు.
ఇప్పుడు అలాంటి వారి కోసం కూడా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. అదే Undo Message Delete ఫీచర్. ఒకవేళ యాక్సిడెంటల్‌గా Delete For Me నొక్కితే దాన్ని Undo చేసి మళ్లీ Delete For Everyone నొక్కవచ్చు.
ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా 2.22.13.6 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తుంది. వాట్సాప్ ప్రత్యర్థి టెలిగ్రామ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాబట్టి దీన్ని వాట్సాప్ కూడా తీసుకువస్తుంది.
వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసే ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కేవలం 100 ఎంబీ లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా 2 జీబీ వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే చాన్స్ ఉంది.
ఈ ఫీచర్‌ను మొదట అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన యూజర్లకు త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఏదైనా ఓ కాంటాక్ట్ నంబర్‌కు 100 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టే. ఒకవేళ అప్‌లోడింగ్ అవ్వకపోతే.. ఈ ఫీచర్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)