WhatsApp Feature: వాట్సాప్ మెసేజ్‌లకు రియాక్షన్ ఫీచర్.. త్వరలోనే లైక్ చేయవచ్చు..
వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యూజర్లు తమ భావనలు సులువుగా వ్యక్తీకరించేలా రియాక్షన్ ఫీచర్ తీసుకురావాలని యోచిస్తోంది. అయితే అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
తన యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కొత్త కొత్త అప్‌డేట్లను తెస్తూ యూజర్లను అలరిస్తుంటుంది. ఇటీవల వాట్సాప్ ద్వారా పేమెంట్లు చేయడం.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు చాట్ హిస్టరీ పంపించుకోవడం వంటి ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
మనకు సాధారణంగా ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో మెసేజ్‌లు పంపితే రిప్లయ్ ఇస్తాం. మనకి మరీ అంత టైమ్ లేకపోతే అవతలి వ్యక్తి పంపిన మెసేజ్‌లకు ఒక రియాక్షన్ ఇస్తాం. అంటే లైక్, డిస్‌లైక్, లవ్, లాఫ్ వంటి రకారకాల రియాక్షన్లలో ఏదోకటి ఇస్తుంటాం. ఈ ఫీచర్ ఐమెసేజ్ ప్లాట్‌ఫాంలో కూడా ఉంది. సరిగ్గా అలాంటి ఫీచర్‌నే వాట్సాప్‌లోనూ ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్ స్టిక్కర్లు, జిఫ్‌లు, ఎమోజీల ద్వారానే యూజర్లు తమ రిప్లైలను ఇచ్చేవారు. ఇప్పుడీ రియాక్ట్ బటన్ వస్తే యూజర్లు తమ భావనలను సులువుగా చెప్పగలుగుతారని అంచనా వేస్తోంది.
ఇదే విషయానికి సంబంధించి డబ్ల్యూబీటా ఇన్ఫో ఒక నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇది పరిశీలన దశలో ఉందని చెప్పింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. వాట్సాప్ అప్‌డేటెడ్ వెర్షన్ల వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు ఈ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. రియాక్షన్లను సపోర్టు చేయాలంటే ప్రస్తుత మీ వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలనే సందేశం ఈ ఫొటోలో కనిపిస్తుంది.
💣 WhatsApp is working on message reactions!
— WABetaInfo (@WABetaInfo) August 25, 2021
Are you ready to end a conversation by placing a reaction? 😆
This feature will be available in a future update for Android and iOS.https://t.co/stPzJLUbNz
ఫేస్ బుక్‌లో మనకు వచ్చిన మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా రియాక్షన్లు ఇవ్వవచ్చు. మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఎమోజీ గుర్తులు కనిపిస్తాయి. వాటిని బట్టి మనం రియాక్ట్ అవ్వవచ్చు. ఇదే ఫీచర్ ట్విట్టర్లో కూడా ఉంది. అయితే ఇందులో మనం రియాక్ట్ అవ్వాలంటే మెసేజ్‌పై డబుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
Also Read: WhatsApp Tricks: వాట్సాప్ లో మెసేజ్ చేసి డిలిట్ చేశారా? ఏం పర్లేదు.. ఇలా చూసేయోచ్చు..