Whatsapp New Feature: యూట్యూబ్ తరహా ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ - ఇకపై వీడియోలు కూడా!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూట్యూబ్ తరహా ఫీచర్‌ను వీడియోల కోసం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
WhatsApp Update: పెద్ద సైజున్న వీడియోలను ఫార్వార్డ్ చేయడానికి, రివైండ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కొత్త అప్‌డేట్‌పై WhatsApp పని చేస్తుంది. అంటే, మీరు ఇప్పుడు యూట్యూబ్‌లో 10 సెకన్ల పాటు వీడియోను ఫార్వార్డ్ లేదా రివర్స్ చేయగలిగినట్లే, కంపెనీ వాట్సాప్‌లో కూడా ఇలాంటి ఆప్షన్‌ను అందించబోతోంది. దీని సహాయంతో మీరు పెద్ద వీడియోలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడగలరు. తక్కువ సమయంలో ఉపయోగకరమైన కంటెంట్‌ను అర్థం చేసుకోగలరు. ఈ అప్‌డేట్ గురించిన సమాచారం వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను రిపోర్ట్ చేసే వెబ్‌సైట్ Wabetainfo ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.24.6లో కనిపించింది. ఇది కంపెనీ రాబోయే కాలంలో అందరు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ అన్ని కొత్త అప్‌డేట్‌లను పొందడంలో మీరు కూడా మొదటి వ్యక్తి కావాలనుకుంటే, కంపెనీ బీటా ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్, విండోస్ యాప్ కోసం బీటా ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
ఆల్టర్నేట్ ప్రొఫైల్స్‌పై కూడా...
వాట్సాప్ యూజర్లు త్వరలో యాప్‌లో రెండో ప్రొఫైల్‌ను క్రియేట్ చేయగలరు. అంటే మీరు మీ వాట్సాప్ ఖాతాలో ఒక ఆల్టర్నేట్ ప్రొఫైల్‌ను కూడా క్రియేట్ చేయగలరన్న మాట. ఇది తెలియని వ్యక్తులతో చాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సహాయంతో, మీ ప్రొఫైల్ ఫోటో, పేరు, ఇతర సమాచారం హైడ్ అవుతుంది. మీరు కొత్త పేరు, ఫోటోతో తెలియని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వగలరు. ఈ ఫీచర్‌లు యాప్‌లో వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరుస్తాయి. మీరు తెలియని వ్యక్తుల నుంచి సురక్షితంగా ఉండగలుగుతారు.
ఆల్టర్నేట్ ప్రొఫైల్‌ను ఎలా సృష్టించాలి?
1. ముందుగా మీ వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయండి.
2. దీని తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
3. అక్కడ ప్రైవసీలోకి వెళ్లి ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు కాంటాక్ట్‌కి వెళ్లి, సెలక్ట్ చేసిన కాంటాక్ట్ కోసం ప్రొఫైల్ ఫోటో కనిపించేలా చేయండి.
4. వేరే ఫోటో, పేరుతో ప్రత్యామ్నాయ ప్రొఫైల్‌ను సృష్టించండి.
5. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ప్రత్యామ్నాయ ప్రొఫైల్‌లు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. దాని కోసం మీ యాప్‌ను అప్‌డేట్ చేయండి.
మరోవైపు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఇంటర్‌ఫేస్‌లో పెద్ద మార్పు చేసింది. ఈ ఛేంజ్ తర్వాత మీరు వాట్సాప్‌ను ఉపయోగించడానికి రెండు చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక చేత్తోనే వాట్సాప్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఎంతో టెస్టింగ్ తర్వాత వాట్సాప్ ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ని ఒక చేత్తో ఉపయోగించినా ఎలాంటి సమస్యా ఉండదు. ఇప్పటి వరకు వాట్సాప్ రూపొందిస్తున్న ఈ ఇంటర్‌ఫేస్ చాలా కాలం పాటు టెస్టింగ్‌లో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?