WhatsApp: వాట్సాప్‌లో సంచలన అప్ డేట్ -ఇక ఇతర యాప్‌ల నుంచీ మెసెజ్‌లు - ఎప్పటి నుంచంటే ?
WhatsApp Update: వాట్సాప్ ఇతర యాప్‌లతో మెసేజ్‌లు పంపే సదుపాయం త్వరలో రానుంది. ఇప్పటికే ఈ అంశంపై బీటా వెర్షన్ టెస్టింగ్ ప్రారంభమయింది.

WhatsApp finally let users send and receive messages from other apps: వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇది యూజర్లకు సులభంగా మెసేజ్‌లు చేసే అవకాశం ఇస్తుంది. వాట్సాప్ యాప్ ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్‌లతో కలిసి పని చేసే సదుపాయాన్ని తీసుకురాబోతోంది. యూరోపియన్ యూనియన్ (EU) చట్టాల ప్రకారం, వాట్సాప్ యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఇతర యాప్‌లకు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపవచ్చు. మొదటగా EUలో అమలు కానుంది. మిగతా ప్రపంచానికి కూడా తర్వాత వస్తుందని మెటా కంపెనీ చెబుతోంది.
వాట్సాప్ నుంచి ఇతర యాప్‌లకు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్ పంపవచ్చు. ఇతర యాప్ నుంచి వచ్చిన మెసేజ్ వాట్సాప్‌లోనే కనిపిస్తుంది. ఇతర యాప్ మెసేజ్‌లను వేరే ఫోల్డర్‌లో లేదా మెయిన్ లిస్ట్‌లో చూడవచ్చు. యూజర్ అనుమతి ఇస్తేనే ఇది పని చేస్తుంది. మెసేజ్‌కు రియాక్షన్ ఇవ్వడం, రిప్లై చేయడం, టైపింగ్ చూడడం వంటివి ఉంటాయి. 2027లో ఇతర యాప్‌లతో వీడియో కాల్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ అవుతాయి, కానీ ఇతర యాప్‌లతో పూర్తి సురక్షితం కాకపోవచ్చు అని వాట్సాప్ చెబుతోంది. ఇతర యాప్‌లు కూడా దీనికి సహకరించాలి.
💚WhatsApp will soon allow its EU users to manage third-party chats from the app.
— Radu Oncescu (@oncescuradu) November 5, 2025
BirdyChat is for now the only private messaging app compatible.@WABetaInfo pic.twitter.com/AzSkD8JiFB
ఇది 2022లో వచ్చిన EU డిజిటల్ మార్కెట్స్ చట్టం (DMA) కారణంగా వచ్చింది. ఈ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద యాప్‌లు ఇతర యాప్‌లతో కలిసి పని చేయాలి. లేకపోతే జరిమానాలు పడతాయి. మెటా 2024లో ఈ ఫీచర్ గురించి వివరాలు ఇచ్చింది. ఈ సదుపాయంపై 2 సంవత్సరాలుగా పని చేస్తున్నామని వాట్సాప్ తెలిపింది. త్వరలో మెటా EU యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతామని చెప్పింది. ఈ ఫీచర్ మొదట EUకే వస్తుంది, తర్వాత ప్రపంచానికి వచ్చే అవకాశం ఉంది.
WhatsApp finally lets you message people on other appshttps://t.co/izQ8C7aI0y pic.twitter.com/fBM9vMGHsi
— Android Police (@AndroidPolice) November 7, 2025
ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు మరిన్ని కనెక్షన్లు ఇస్తుంది. మెసేజింగ్ రంగంలో మార్పులు వస్తాయి. ఇండియాలో టెలిగ్రామ్ వంటి యాప్‌లతో పోటీ పెరుగుతుంది. వాట్సాప్ ప్రపంచ మెసెజింగ్ యాప్ లలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఎన్ని యాప్ లు వచ్చినా ఆ యాప్ ను దాటలేకపోతున్నారు. అయితే టెలిగ్రామ్ తో పాటు మరికొన్ని యాప్స్.. ప్రజాదరణ పొందుతున్నాయి. అందుకే వాటి నుంచి మెసెజులు కూడా అందుకునే పంపుకునే అవకాశం ఉంటే.. మెసెజింగ్ రంగం మారిపోతుంది.





















