అన్వేషించండి

WhatsApp New Updates: వాట్సాప్‌లో ఈ మార్పులు గమనించారా, కొత్త అప్‌డేట్స్ ఇవే

WhatsApp Updates: వాట్సాప్‌లో కలర్‌ స్కీమ్‌ గతంలో బ్లూ కలర్‌లో ఉండగా ఇప్పుడది గ్రీన్‌ కలర్‌లోకి మారిపోయింది.వీటితో పాటు మరి కొన్ని అప్‌డేట్స్ కూడా వచ్చాయి.

WhatsApp Theme Colour: ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో (WhatsApp Colour Change) వస్తున్న వాట్సాప్‌ ఇప్పుడు మరోసారి యాప్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే ఇంటర్‌ఫేస్ మారిపోగా ప్రస్తుతం కలర్ స్కీమ్‌నీ మార్చేసింది. ఇప్పటి వరకూ బ్లూ థీమ్‌లో ఉన్న వాట్సాప్‌ ఇప్పుడు గ్రీన్‌ కలర్‌లోకి మారింది. అయితే...ఈ మార్పుపై యూజర్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుందని అంటుంటే మరి కొందరు గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారు. మొన్నటి వరకూ వేరే దేశాల్లోనే కలర్‌ స్కీమ్‌ మారగా..ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చింది. దీనిపై వాట్సాప్ వివరణ ఇచ్చింది. యూజర్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది. లుక్ అండ్ ఫీల్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు స్పష్టం చేసింది. స్పేసింగ్, కలర్స్, ఐకాన్స్‌ ఇలా అన్ని విధాలుగా మార్పులు చేసినట్టు తెలిపింది. 

ఏమేం మార్పులొచ్చాయ్..?

iOSతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ ఈ కలర్ స్కీమ్‌ మారింది. iPhonesలో ఇప్పటి వరకూ బ్లూ కలర్ స్కీమ్‌ ఉంది. ఇకపై ఇదంతా గ్రీన్ కలర్‌లోకి మారింది. స్టేటస్ బార్, చాట్‌ లిస్ట్ విండ్‌ కలర్ థీమ్ మారిపోయింది. అంతే కాదు. వాట్సాప్‌లో షేర్ చేసే లింక్స్‌ కూడా బ్లూ కలర్‌లో కాకుండా గ్రీన్‌ కలర్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు యూజర్స్ ఈ మార్పుల్ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తుండగా...ఇంకొందరి ఫోన్‌లలో క్రమంగా అప్‌డేట్ కానుంది. యాండ్రాయిడ్‌లోని డార్క్‌మోడ్‌లోనూ మార్పులు రానున్నాయి. లైట్‌మోడ్‌లోనూ రీడబిలిటీ పెంచేలా మార్పులు చేసింది. కలర్‌తో పాటు మరి కొన్ని మార్పులూ కనిపిస్తున్నాయి. గతంలో ఎవరైనా వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉంటే "online" అని కనిపించేది. కానీ..ఇప్పుడది "Online" గా మారింది. మొదటి అక్షరం క్యాపిటల్‌గా మార్చింది. అదే విధంగా గతంలో ఎవరైనా టైప్ చేస్తుంటే "typing" అని కనిపించేది. ఇప్పుడది "Typing"గా మారింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్స్‌పై చర్చ జరుగుతోంది. 

కేంద్రంతో ఫైట్..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌పై వాట్సాప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏవైనా వదంతులు వ్యాప్తి చెందినప్పుడు ఆ సమాచారానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయి..? ముందుగా ఎవరు దాన్ని పంపారు..? అనే వివరాలు కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందన్నది ఆ నిబంధన సారాంశం. అయితే...దీనిపై ఢిల్లీహైకోర్టులో పిటిషన్ దాఖలుగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాట్సాప్‌ తన వాదనలు వినిపించింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదని స్పష్టం చేసింది. ఓ మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే తమ యాప్‌లోని ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్ చేయాలని వివరించింది. అలా చేస్తే వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని వాదించింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వాట్సాప్‌లో మాత్రమే కనిపించే అరుదైన ఫీచర్ అని, దాన్ని బ్రేక్ చేయమంటే ఎలా అని ప్రశ్నించింది. ఇలాంటి నిబంధనలు విధిస్తే భారత్‌లో సేవలు కొనసాగించడం కష్టమే అని అసహనం వ్యక్తం చేసింది. 

Also Read: Fact Check: I.N.D.I.A కూటమికి అనుకూలంగా ప్రధాని మోదీ ట్వీట్? అసలు నిజమిదే

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget