అన్వేషించండి

WhatsApp: వాట్సాప్‌లో కూడా మెసేజ్ ఎడిట్ - ఎలా చేయాలో తెలుసా?

వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేసే ఆప్షన్‌ను దశల వారీగా తీసుకువస్తుంది.

WhatsApp Edit Message Feature: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత నెలలో వాట్సాప్ కోసం ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రారంభించారు. ఈ నెల నుంచి ఈ ఫీచర్ కొంతమంది ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు కనిపించడం ప్రారంభించింది. మీరు ఈ ఫీచర్‌ను పొందకపోతే ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌కి వెళ్లి యాప్‌ని ఒకసారి అప్‌డేట్ చేయండి. ఎడిట్ మెసేజ్ ఫీచర్ చాలా సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఫీచర్. ఈ ఫీచర్ లైవ్‌లోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలాసార్లు తొందరపాటుతో తప్పుడు సందేశాలను పంపడం వలన ఇబ్బంది పడకుండా ఉంటారు.

ఎడిట్ మెసేజ్ ఫీచర్ కింద మీరు పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల వరకు ఎడిట్ చేయగలరు. ఈ టైమ్ లిమిట్ తర్వాత మీరు సందేశాన్ని ఎడిట్ చేయలేరు. ఈ టైమ్ లిమిట్‌ను వాట్సాప్ దశల వారీగా పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఏదైనా మెసేజ్‌ను ఎడిట్ చేస్తే, అది వినియోగదారులకు ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తుంది.

ఇలా ఎడిట్ చేయండి...
1. పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేయడానికి, మీరు ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి.
2. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మెసేజ్‌ను ఎడిట్ చేయండి.

వాట్సాప్ త్వరలో వీడియో కాల్స్ సమయంలో వినియోగదారులకు స్క్రీన్ షేర్ చేసే ఫీచర్‌ను కూడా అందించనుంది. దీని కారణంగా వినియోగదారులు కాల్స్ సమయంలో అందులోని వ్యక్తులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ కూడా జరుగుతోంది.

ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. స్క్రీన్ షేర్ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు స్క్రీన్‌పై ఏం చేసినా, వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తులందరూ దాన్ని చూడగలరు. వాట్సాప్ నోటిఫికేషన్‌లు కాకుండా, ఇతర అప్‌డేట్‌లు కూడా వినియోగదారులలకు కనిపిస్తాయి. మీకు ఇది అవసరం లేకపోతే దీని కోసం మీరు ఫోన్‌లో ‘do not disturb’  మోడ్‌ను ఆన్ చేయవచ్చు.

ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని మొదట Wabetainfo అందించింది. వీడియో కాల్ సమయంలో దిగువ బార్‌లో వినియోగదారులకు స్క్రీన్ షేర్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్‌లో ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్ షేరింగ్‌ను ఉపయోగించవచ్చు.

వాట్సాప్‌లో మిస్డ్ కాల్‌ల కోసం విండోస్ వినియోగదారులకు మెటా 'కాల్ బ్యాక్' అనే ఆప్షన్‌ను ఇవ్వబోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు కాల్ చేయడానికి వాట్సాప్ పైభాగంలో క్లిక్ చేయనవసరం లేదు. పక్కనే ఉన్న మిస్డ్ కాల్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి కాల్ చేయగలరు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 'ఛానల్' ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. క్రియేటర్స్ ఛానెల్ ఫీచర్‌ను పొందిన వెంటనే, వారు తమ ఫాలోయర్ల కోసం వారి రోజువారీ అప్‌డేట్‌లు అందులో పోస్ట్ చేయగలరు. ఇప్పటికే ఉన్న ఫాలోయర్లు ఛానెల్‌లో చేరడానికి కొత్త నోటిఫికేషన్‌ను పొందుతారు. ఫాలో కానివారు క్రియేటర్ ప్రొఫైల్ లేదా స్టోరీకి వెళ్లి అక్కడ ఉన్న ఛానెల్‌లో చేరాలి. ఛానెల్‌లో క్రియేటర్ మాత్రమే పోస్ట్ చేయగలరు. ఇతర ఛానెల్ సభ్యులందరూ కేవలం అప్‌డేట్స్‌ను మాత్రమే చూడగలరు. పోల్ ప్రశ్నకు రియాక్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఫాలోయర్లకు ఉంటుంది.

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget