Whats App: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఒకే ఒక్కసారి చూస్తే చాలు.. ఆ తర్వాత డిలీటే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానితో ఫొటోలు, వీడియోలు పంపితే.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు.
వాట్సాప్... యూజర్స్ కోసం కొత్త పీఛర్‌ను తీసుకొచ్చింది. అదే వ్యూ వన్స్. దీనితో పొటోలు, వీడియోలు వేరే వాళ్లకి పంపితే.. ఒకే ఒక్కసారి మాత్రమే చూడొచ్చు. మనం ఇతరులకు పంపే ఫోటోలు, వీడియోలు వారి లైబ్రరీలో స్టోర్ అయ్యే ఛాన్సే లేదు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వినియోగదారులు వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం ద్వారా వాటిని స్టోరేజ్‌లో పెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఫొటోలు పంపించేటప్పుడు కింద క్యాప్షన్‌బార్‌లో ఉన్న 1 ఐకాన్‌పై క్లిక్ చేస్తే.. ఈ వ్యూ వన్స్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా పంపిన ఫొటోలను కానీ, వీడియోలను కానీ చూసి ఎగ్జిట్ అయ్యాక వాటిని మళ్లీ చూడటం కుదరదు. ఈ కంటెంట్ ఫోన్‌లో సేవ్ అవ్వదు. దీన్ని ఫార్వర్డ్ చేయడానికి కూడా కుదరదు. ఒకవేళ 14 రోజుల పాటు ఓపెన్ చేయకపోతే.. అది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అవుతుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలనుకునేంటే మాత్రం ఇతరులకు ఫోటోలు, వీడియోలు పంపే ముందు ప్రతిసారి తప్పనిసరిగా వ్యూ వన్స్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్స్ తమకు నమ్మకమైన వారికి ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు ఉపయోగిస్తే మంచిదని వాట్సాప్ తెలిపింది. ఎందుకంటే ఇతరులు స్క్రీన్ షాట్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇందులో ఫొటోలు పంపిస్తే స్క్రీన్ షాట్ పంపవచ్చు. వీడియోలు పంపిస్తే.. స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు.
మీరు ఏదైనా ఫొటో, వీడియో, గిఫ్‌లను వాట్సాప్‌లో ఇతరులకు పంపితే, అవతలి వ్యక్తి వాటిని కేవలం ఒక్కసారే చూసేలా చేయడమే ఈ వ్యూ వన్స్ ఫీచర్ ఉపయోగం. ఈ ఫీచర్ ద్వారా ఫైల్ పంపితే ప్రివ్యూ కనిపించదు. అవతలి వారు దానిపై క్లిక్ చేసి చూసిన తర్వాత ఛాట్ స్క్రీన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే రిసీవర్, సెండర్ ఛాట్ స్క్రీన్ల నుంచి సదరు ఫైల్ డిలీట్ అయిపోతుంది. వాట్సాప్ ద్వారా ముఖ్యమైన సమాచారం షేర్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలానే వ్యూ వన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లు ఫార్వార్డ్, సేవ్, స్టార్డ్ మెసేజ్, షేర్ చేయలేరు.
ఈ ఫీచర్‌ను గతేడాది సెప్టెంబర్ నుంచే పరీక్షిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీకు కనిపించకపోతే వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది.
Also Read: Amazon Alexa on Covid Testing: హే అలెక్సా.. కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడున్నాయి?