అన్వేషించండి

Vivo Y54s 5G: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.20 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వై54ఎస్ 5జీ.

వివో వై54ఎస్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. వాటర్‌డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

వివో వై54ఎస్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(సుమారు రూ.19,800) ఉంది. లేక్ బ్లూ, టైటానియం ఎంప్టీ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

వివో వై54ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉంది.

మీడియాటెక్ హీలియో 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ ఐడీ ఫీచర్ కూడా ఉంది. 5జీ, బ్లూటూత్ వీ5.1, 3.5 ఎంఎం ఆడియోజాక్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, ఓటీజీ, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ కూడా ఇందులో ఉన్నాయి. ఎస్‌బీసీ, ఏఏసీ, ఎల్‌డీఏసీ, యాప్ట్ఎక్స్ హెచ్‌డీ, యాప్ట్ఎక్స్ కోడెక్ కూడా ఇందులో ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 188.4 గ్రాములుగా ఉంది.

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget