Vivo Y03: రూ.ఏడు వేలలోపు ధరలోనే వివో వై03 - ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వై03.
Vivo Y03 Launched: వివో వై03 స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన వివో వై02కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త ఫోన్‌లో చాలా అప్‌గ్రేడ్స్ చేశారు. రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు, కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
వివో వై03 ధర (Vivo Y03 Price in India)
దీని ధర 12.99 లక్షల ఇండోనేషియా రూపాయలుగా (మనదేశంలో రూ.6,900) ఉంది. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను 14.99 లక్షల ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.8,000) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు.
వివో వై03 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo Y03 Specifications)
ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐగా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందించారు. దీన్ని వర్చువల్‌గా మరో 4 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14పై వివో వై03 రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు మరో క్యూవీజీఏ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. డిస్‌ప్లే మధ్యలో ఉన్న వాటర్ డ్రాప్ నాచ్‌లో దీన్ని చూడవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.
వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. కంపెనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోర్ట్‌ఫోలియోలో కూడా ఈ ఫోన్ జాయిన్ అయింది. వివో జీ2లో 6.58 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. వివో జీ2 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?