Vivo V23 5G Sale: వివో వీ23 సేల్ మొదలైపోయింది.. అదిరిపోయే ఫీచర్లు.. కెమెరాలు సూపర్!
వివో వీ23 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అదే వివో వీ23 5జీ.
వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీ23 5జీ సేల్‌ను మనదేశంలో ప్రారంభించింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు రంగులు మారే విధంగా ఫ్లోరైట్ ఏజీ గ్లాస్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్ కూడా ఇందులో అందించారు.
వివో వీ23 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,990గా నిర్ణయించారు. స్టార్ డస్ట్ బ్లాక్, సన్ షైన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
వివో వీ23 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై వివో వీ23 5జీ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు అందించారు. వివో వీ23లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వివో వీ23 బరువు 179 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!