అన్వేషించండి

Whatsapp Web: వాట్సాప్ వెబ్‌లో స్టేట‌స్‌, వీడియో కాలింగ్ ఇలా ఈజీగా చేసేయండి

Whatsapp web Uses | సామాజిక మాధ్యమం వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్‌ నుంచి వాట్సాప్ స్టేట‌స్‌లు మార్చ‌డం, వీడియో కాల్స్ మాట్లాడ‌టం ఎలాగో తెలుసుకుందాం..

How to use Whatsapp web మ‌న దేశంలో ఇప్పుడు వాట్సాప్ లేని పోన్ ఉండ‌దు. వాట్సాప్ మెసెంజ‌ర్ వాడ‌ని స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు లేరు. ఇప్పుడిది నిత్య‌కృత్యం అయ్యింది. ప‌ల్లెల్లోకి కూడా 5 జి నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌చ్చాక వాట్సాప్ వినియోగం పెరిగింది. దీంతోపాటు చౌకైన నెట్ వ‌ర్క్ డేటా రీచార్జ్ ప్లాన్లు, వంద‌ల కొద్దీ నెట్ ప్రొవైడ‌ర్లు పెరగ‌డంతో ఇంట‌ర్నెట్ వినియోగం ఎక్కువైంది. గ్లోబ‌లైజేష‌న్ కార‌ణంగా ప్ర‌పంచం మ‌న చేతిలోనే ఉన్న‌ట్టయింది. ప్ర‌పంచంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ఆడియో వీడియో కాల్ సౌక‌ర్యం, చాటింగ్ చేసుకునే సౌక‌ర్యం వాట్సాప్ మెసెంజ‌ర్‌లో ఉండ‌టంతో బాగా పాపుల‌ర్ అయింది.  సామాన్యుడికి కూడా సుల‌భంగా అర్థం అయ్యే విధంగా త‌యారు చేసిన హోమ్ స్ర్రీన్ లేఅవుట్‌తో వాట్సాప్ అంద‌రికీ చేరువైంది. కాల్స్‌తోపాటు ప్ర‌తి ఒక్క‌రూ వీడియో, ఆడియో, క్లిప్పులు, ఫొటోలు, ఇత‌ర సందేశాల‌ను పంపుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. అయితే దీన్ని ల్యాప్‌టాప్‌కి ఎలా క‌నెక్ట్ చేసుకోవాలో చూద్దాం.. వాట్సాప్ స్టేట‌స్ చూడ‌టం, యాడ్ చేయ‌డం తెలుసుకుందాం..

ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్‌కి వాట్సాప్‌ని ఎలా క‌నెక్ట్ చేయాలంటే..

  • ముందుగా గూగుల్‌లోకి వెళ్లి వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయాలి
  • ముందుగా వ‌చ్చిన web.whatsapp.com  లింక్ పై క్లిక్ చేయాలి
  • క్యూఆర్ కోడ్‌తో ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
  • త‌ర్వాత మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో కి వెళ్లండి.
  • మీ ఫొటో (DP)Display Picture ప‌క్క‌నే మై కోడ్‌, స్కాన్ కోడ్ ఉంటుంది.
  • స్కాన్ కోడ్ మీద క్లిక్ చేసి ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ను ల్యాప్‌టాప్‌లో చూడొచ్చు. 
  • మై కోడ్ ను ఉప‌యోగించి మ‌రొక ఫోన్‌లో మీ వాట్సాప్‌ను లాగిన్ చేసుకోవ‌చ్చు.

 

డెస్క్‌టాప్‌లో వాట్సాప్ స్టేట‌స్‌లు ఎలా చూడాలి...

డెస్క్ టాప్‌లో వాట్సాప్ లాగిన్ అయ్యాక విండోలో ఎడ‌మ‌వైపున చాట్స్‌, స్టేట‌స్‌, ఛానెల్స్‌, క‌మ్యూనిటీస్ అని నాలుగు ఆప్ష‌న్స్ ఉంటాయి.

స్టేట‌స్ ఆప్ష‌న్ ఎంచుకుంటే మీ స్నేహితులు, బంధువుల యొక్క స్టేట‌స్‌ను చూసేయొచ్చు.

వాట్సాప్ స్టేట‌స్‌ను ఎలా సెట్ చేసుకోవాలి..

  • ముందుగా వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్‌లోకి వాట్సాప్ లాగిన్ కావాలి.
  • గూగుల్ సెర్చ్ బాక్సులో వాట్సాప్ ప్ల‌స్ ఫ‌ర్ వాట్సాప్ వెబ్ అని టైప్ చేయాలి.
  • క్రోమ్‌కి ఎక్స్ టెన్ష‌న్‌ను యాడ్ చేసుకోవాలి.
  • వాట్సాప్ లాగిన్ అయ్యాక వాట్సాప్ ప్ల‌స్ ద్వారా పోస్ట్ స్టేట‌స్ ఆప్ష‌న్ ఎంచుకుని స్టేట‌స్ పోస్ట్ చేయొచ్చు.

వాట్సాప్ వెబ్ ద్వారా వీడియో కాల్..

  • మీ పీసీ లేదా ల్యాప్ టాప్‌లో క‌నెక్ట‌యిన వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయ‌డానికి ఇలా చేయండి..
  • ముందుగా వాట్సాప్ వెబ్‌కి లాగిన్ అవ్వాలి.
  • టాప్‌లో ఉన్న మూడు వెర్టిక‌ల్ డాట్స్‌పై క్లిక్ చేయాలి.
  • క్రియేట్ ఏ రూమ్ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి. మీకొక పాప‌ప్ ఓపెన్ అవుతుంది.
  • కంటిన్యూ ఆన్ మెసెంజ‌ర్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
  • ఎవ‌రికైతే వీడియో కాల్ చేయాల‌నుకుంటున్నారో వారికి వాట్సాప్ ద్వారా లింక్ ను పంపించాల్సి ఉంటుంది.

(ఇందుకోసం మీకు ఫేస్‌బుక్ అకౌంట్ క‌లిగి ఉండాలి. ) గ్రూప్ కాలింగ్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget