News
News
X

Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!

ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్!

FOLLOW US: 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా, ఎవరు చేశారో తెలుసుకునే వెసులుబాటు కల్పించబోతుంది. కాల్ స్వీకరించినప్పుడు కాలర్ పేరు డిస్‌ప్లే మీద కనిపించేలా సరికొత్త మార్పులు తీసుకురానుంది. గుర్తుతెలియని కాల్స్ మూలంగా చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాయ్ దృష్టికి వచ్చింది. అంతేకాదు, గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ నెంబర్స్ ద్వారా పలువురిని బెదిరించినట్లు గుర్తించారు. ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ (KYC) రికార్డ్‌ను బట్టి కాల్ చేసిన వారి పేరు డిస్ ప్లే అవుతుందని వెల్లడించింది.  ట్రాయ్ తీసుకునే ఈ నిర్ణయం మూలంగా తమ కాంటాక్ట్ లిస్టులో కాలర్  నెంబర్ లేకపోయినా, ఫోన్ చేసిన వారు ఎవరనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.  

⦿ కచ్చితమైన  గుర్తింపు పొందే అవకాశం!

ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించుకుంటున్నారు. డేటా క్రౌడ్‌ సోర్స్‌ గా ఉన్నందున Truecaller లాంటి యాప్‌ లకు చాలా వరకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితమైన ప్రామాణికత ఉండదు. కానీ, ట్రాయ్ తీసుకునే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం కచ్చితంగా ఉంటుంది.

⦿ ఎందుకంటే.. ఈ KYC డేటా, సర్వీస్ ప్రొవైడర్లు అధికారికంగా ఇస్తారు. ఇందులో ఎలాంటి తప్పుడు సమాచారానికి అవకాశం ఉండదు.  దీని కారణంగా కాలర్ కు సంబందించి కచ్చితమైన గుర్తింపు ఉంటుంది. ఈ చర్యల మూలంగా స్పామ్ (Spam) కాల్స్ ను నివారించే అవకాశం ఉంటుంది. థ్రెటెనింగ్ కాల్స్ నుంచి రక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది.  త్వరలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 

News Reels

Also Read: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

⦿ వాట్సాప్ విషయంలోనూ కీలక నిర్ణయం

వాట్సాప్ విషయంలోనూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సమీప భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా చేసే కాల్‌ల కోసం ప్రత్యేక ఎక్సైజ్ కూడా చేస్తోంది.  Whats App SIM కార్డ్‌లకు లింక్ చేయబడి ఉంటున్నందున, వినియోగదారు ఫోన్ నంబర్, Whats App అకౌంట్ కు మధ్య లింక్ ఉంటుంది.  "DoT, Trai, టెలికాం ఆపరేటర్ల మధ్య అనుసంధానం కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి త్వరలో వాట్సాప్ విషయంలో కేంద్రం కచ్చితమైన నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.  

Read Also: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది 

Published at : 16 Nov 2022 07:05 PM (IST) Tags: KYC Truecaller Telecom Regulatory Authority Of India Unknown Call Caller Spam Unknown Caller’s Unknown Calls

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!