ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'ది శాంటా క్లాజెస్' బుధవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా 19న తెలుగు, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతోంది. 'సర్దార్' మూవీ శుక్రవారం 18న ‘ఆహా’లో విడుదల కానుంది నవంబరు 16న హాలీవుడ్ సినిమా 'ది వండర్' విడుదలైంది. ‘జీ5’లో ఈనెల 18వ తేదీ నుంచి హిందీ వెబ్ సిరీస్ 'కంట్రీ మాఫియా' స్ట్రీమింగ్ కానుంది. ఎంఎక్స్ ప్లేయర్‌లో 18వ తేదీ నుంచి 'ధారవి బ్యాంక్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ‘వండర్ ఉమన్’ ఈ నెల 18 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'ఐరావతం' వెబ్ సిరీస్ ఈ నెల 17 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లోస్ట్రీమింగ్ కానుంది. రాజ్ తరుణ్ నటించిన వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట' ఈ నెల 17న ‘జీ5’లో స్ట్రీమింగ్ కానుంది.