Elon Musk Twitter:భారీగా పడిపోయిన ట్విట్టర్ ఆదాయం - కానీ, ఆ విషయంలో మస్క్ హ్యాపీ?
యాక్టివిటీ గ్రూప్స్ ప్రకటనదారులపై తెస్తున్న ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ ఆదాయం తగ్గిందని మస్క్ తెలిపారు. తాజాగా మానిటైజబుల్ డైలీ యాక్టివ్ యూజర్లలో 20 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. అంతర్గత గందరగోళం నడుమ ప్రకటనదారులు ట్విట్టర్ ఫ్లాట్ ఫారమ్ ను విడిచిపెట్టినందున ఆదాయంలో భారీగా తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. ఇక ట్విట్టర్ రోజువారీ వినియోగదారు వృద్ధి ఆల్ టైమ్ హైకి చేరుకుందని ట్విట్టర్ ప్రకటనదారులకు తెలిపింది. మస్క్ టేకోవర్ తర్వాత Twitterకు సంబంధించిన మానిటైజబుల్ డైలీ యూజర్ (mDAU) వృద్ధి 20 శాతానికి పైగా సాధించింది. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం "Twitterకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో మరింతగా వినియోగం పెరుతోంది” అని వెల్లడించింది. ట్విట్టర్ 15 మిలియన్ల కంటే ఎక్కువ మానిటైజబుల్ డైలీ యూజర్ లను సాధించి.. క్వార్టర్ బిలియన్ మార్క్ ను దాటింది.
ట్విట్టర్ ప్రకటనలను పాజ్ చేసిన ప్రముఖ సంస్థలు
Twitter చివరిగా 237.8 మిలియన్ మానిటైజబుల్ డైలీ యూజర్ లను కలిగి ఉండగా, రెండవ త్రైమాసికానికి 16.6 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అటు వోక్స్ వ్యాగన్ గ్రూప్ అనేక ఇతర కంపెనీలతో కలిసి ట్విట్టర్‌లో వారి ప్రకటనలు పాజ్ చేసింది. సమస్యాత్మక కంటెంట్ తో పాటు వారి ప్రకటనలు కనిపించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాయి. డానిష్ బ్రూయింగ్ కంపెనీ, కార్ల్స్ బర్గ్ గ్రూప్ కూడా తన మార్కెటింగ్ టీమ్స్ ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కూడా ట్విట్టర్ లో ప్రకటనలను నిలిపివేసింది.
వాక్ స్వాతంత్ర్యాన్ని నాశనం చేస్తున్నట్లు మస్క్ ఆగ్రహం
యాక్టివిస్ట్ గ్రూప్స్ ప్రకటనదారులపై అనవసరమైన ఒత్తిడి తెస్తున్నందున ట్విట్టర్ ఆదాయంలో భారీ తగ్గుదల కనిపించిందని మస్క్ ఇప్పటికే వెల్లడించారు. ఈ యాక్టివిస్ట్ గ్రూపులు వాక్ స్వాతంత్య్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కంటెంట్ మోడరేషన్‌తో ఏమీ మారనప్పటికీ, యాక్టివిస్ట్ గ్రూపులు ప్రకటనదారులపై ఒత్తిడి చేయడం వల్ల ట్విట్టర్ ఆదాయంలో భారీగా పడిపోయింది. యాక్టివిస్టులను శాంతింపజేయడానికి మేము చేయగలిగినదంతా చేశాము" అని మస్క్ ట్విట్ చేశారు. " పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. వారు అమెరికాలో వాక్ స్వాతంత్య్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని మస్క్ మండిపడ్డారు.
భారీగా పడిపోయిన ట్విట్టర్ ఆదాయం
ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఆదాయం 1 శాతం పడిపోయి $1.18 బిలియన్లకు తగ్గింది.ఆ తర్వాత $270 మిలియన్లను కోల్పోయింది. ఇది ప్రకటనదారుల నుంచి వస్తున్న అనిశ్చితికి కారణంగా పలు నివేదికలు వెల్లడించాడు. ప్రకటనల ఆదాయం $1.08 బిలియన్ అయితే చందా, ఇతర ఆదాయం మొత్తం $101 మిలియన్లు తగ్గింది. మొత్తంగా ఈ సంవత్సరానికి గాను 27 శాతం ఆదాయం తగ్గింది.
Twitter has had a massive drop in revenue, due to activist groups pressuring advertisers, even though nothing has changed with content moderation and we did everything we could to appease the activists.
— Elon Musk (@elonmusk) November 4, 2022
Extremely messed up! They’re trying to destroy free speech in America.