News
News
X

Twitter: పొరపాటున తీసేశాం - తిరిగి రండి ప్లీజ్ - ఉద్యోగులకు ట్విట్టర్ బుజ్జగింపు!

కొందరు ఉద్యోగులను పొరపాటున తీసేశామని తిరిగి విధుల్లో చేరాల్సిందిగా ట్విట్టర్ యాజమాన్యం కోరుతోందని వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 

గత వారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ట్విట్టర్ ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన డజన్ల కొద్దీ ఉద్యోగులను సంప్రదించినట్లు తెలుస్తోంది. తిరిగి రావాలని కోరిన వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే కొందరిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది వ్యక్తులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు వారి యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలియజేస్తుంది.

"Twitterలో ఉద్యోగులను తగ్గించడం గురించి చూస్తే కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు మరో ఆప్షన్ లేదు." అని మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ప్రస్తుతం దాదాపు 3,700 మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారు.

వీరిని మస్క్ కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి కంపెనీలో ఉంచారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు టార్గెట్లను చేరుకోవడానికి కార్యాలయంలోనే పడుకున్నారు. "పేరడీ అని స్పష్టంగా పేర్కొనకుండా ఎవరైనా మరొకరి ట్విట్టర్ హ్యాండిల్‌ను అనుకరించే ఖాతా తెరిస్తే దాన్ని శాశ్వతంగా నిలిపివేస్తాం." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.

News Reels

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

View this post on Instagram
 
A post shared by Entrepreneurship | Business | Startup (@entrepreneursthinks)

Published at : 07 Nov 2022 08:32 PM (IST) Tags: Twitter News Elon Musk Twitter Layoffs Twitter Updates

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?