Bug Bounty: ట్విట్టర్ చెప్పిన ఈ పని చేయండి.. ఎంచక్కా లక్షలు ఎగరేసుకుపోవచ్చు
ట్విట్టర్ కు ట్విట్టరే ఛాలెంజ్ విసురుకుంది. అది ఎలా అంటారా? దాని కోసం తన యూజర్లకు పోటీ పెట్టింది. అందులో డబ్బులు గెలుచుకోవచ్చు.
ట్విట్టర్ ఓ పోటీని పెట్టింది. యూజర్ల సమాచారానికి సంబంధించి తాను అందిస్తున్న సెక్యూరిటిపైన ట్విట్టర్ కు ట్విట్టరే ఛాలెంజ్ విసురుకుంది. లోపాలను గుర్తిస్తే నగదు బహుమతి అందిస్తామని తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అల్గారిథంలో బగ్‌ను గుర్తిస్తే నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది ట్విట్టర్. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టడం ట్విటర్‌కు ఇదే మెుదటిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్ కాన్ ఏఐ విలేజ్‌లో ఈ పోటీ జరగుతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ప్రకటించింది. సాధారణంగా.. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనుగొనడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్ అని తెలిపింది. ఈ ఛాలెంజ్ ను తీసుకుని లోపాలను చూపిస్తే.. బహుమతి ఇవ్వనుంది.
నిజానికి.. ఈ పోటీని ట్విట్టర్ మేలోనే ప్రకటించింది. కంపెనీకి చెందిన ముఖ్యమైన అల్గారిథం, ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథంలోని లోపాన్ని గుర్తించాలని చెప్పింది. దానికి సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది. యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథంలోని లోపాలను గుర్తిస్తేనే.. పరిష్కారం ఈజీగా ఉంటుందని ట్విటర్ వెల్లడించింది. దానికోసమే.. యూజర్లను హ్యాకింగ్ నుంచి రక్షించడానికే ఈ పోటీ పెడుతున్నాని పేర్కొంది. ఏథికల్ హ్యాకర్లు, రిసెర్చ్ కమ్యూనిటీ డెవలపర్లకు ఈ పోటీ సువర్ణావకాశం. ఈ పోటీలతో సమస్యలను గుర్తించొచ్చని ట్విట్టర్ అభిప్రాయపడింది.
ట్విటర్ బిగ్ బౌంటీ ప్రోగ్రాంలో భాగంగా లోపాలను గుర్తించిన మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $3,500-సుమారు రూ. 2,60,242, $ 1,000-సుమారు రూ. 74,369, $ 500-సుమారు రూ. 37,184 నగదు బహుమతులను ట్విటర్ అందిస్తుంది. ఆగస్టు 8న డేఫ్ కాన్ ఏఐ విలేజ్‌లో హోస్ట్ చేస్తోన్న వర్క్ షాప్‌లో విజేతలను ప్రకటిస్తుంది. ఈ పోటీలో పాల్గొనాలి అనుకునేవారు... 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు చేయవచ్చు.
బగ్ బౌంటీ అంటే..
యూజర్లకు అందుబాటులో ఉన్న వెబ్ సైట్లు, యాప్ లు , సౌఫ్ట్ వేర్స్ లో ఎవరూ గుర్తించలేని భద్రతపరమైన లేదా సైబర్ దాడికి అవకాశముండేలా కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాంటి బగ్స్ ను ఐటీ ఎక్స్ పర్ట్ నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే కనిపెట్టి చెప్పగలిగితే.. వారికి నగదు బహుమతి ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ నే బగ్ బౌంటీ అంటారు. ప్రముఖ సెర్చింజన్లు గూగుల్... యాహూ, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ సహా అనేక ఐటీ సంస్థలు, ఇతర కంపెనీలు తమ వెబ్ సైట్లలో లోపాలు గుర్తించి చెప్పమంటూ.. తరచూ బగ్ బౌంటీ కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. కనిపెట్టి చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తాయి. తద్వారా సంస్థలు తమ సేవలను మరింత మెరుగుపర్చుకుంటాయి.