అన్వేషించండి

Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ టీవీలను గ్లోబల్ లాంచ్ చేసింది. అవే షియోమీ ఏ2 టీవీ సిరీస్.

షియోమీ కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. అవే షియోమీ టీవీ ఏ2 సిరీస్. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. 32 ఇంచులు, 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల స్క్రీన్ సైజ్‌ల్లో షియోమీ టీవీ ఏ2 సిరీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 32 ఇంచుల మోడల్‌లో HD రెజల్యూషన్ డిస్‌ప్లేను అందించారు. 43, 50, 55 ఇంచుల మోడల్స్‌లో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. వీటిలో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై టీవీలు ఈ టీవీలు పనిచేయనున్నాయి.

షియోమీ టీవీ ఏ2 సిరీస్ ధర
ప్రస్తుతానికి వీటిలో 55 ఇంచుల మోడల్ ధరను మాత్రమే కంపెనీ ప్రకటించింది. దీని ధర యూరప్‌ మార్కెట్‌లో 529 యూరోలుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. త్వరలో ఈ టీవీలు మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

షియోమీ టీవీ ఏ2 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీల డిస్‌ప్లేల్లో 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ నాలుగు మోడల్స్‌లో 32 ఇంచుల వేరియంట్ హెచ్‌డీ (1366x786 పిక్సెల్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మిగిలిన 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే మోడల్స్‌లో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేలు అందించారు. 4కే మోడల్స్ 10-బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్ 10, డాల్బీ విజన్, హెచ్‌జీఎల్‌ను సపోర్ట్ చేయనున్నాయి. అంచులు లేని డిజైన్‌తో షియోమీ ఈ టీవీలను రూపొందించింది.

క్వాడ్‌కోర్ కోర్‌టెక్స్-ఏ55 సీపీయూపై షియోమీ టీవీ ఏ2 సిరీస్ టీవీలు పనిచేయనున్నాయి. ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టం కూడా ఉండనుంది. 32 ఇంచుల మోడల్‌లో 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ అందించారు. 4కే వేరియంట్ టీవీలు 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి.

వీటిలో 32 ఇంచుల మోడల్ 20Wల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను అందించారు. 43, 50, 55 ఇంచుల మోడల్స్ టీవీల్లో 24W సౌండ్ ఔట్‌పుట్ లభించనుంది. ఈ టీవీలన్నీ డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్‌డీకి సపోర్ట్ చేస్తాయి. బేస్ మోడల్‌లో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉండగా.. మిగిలిన మూడు వేరియంట్లలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు అందించారు. అన్ని టీవీల్లోనూ రెండు యూఎస్‌బీ పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ వెర్షన్‌ 5.0తో ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget