News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samsung Smart Upgrade Program: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ బంపర్ ఆఫర్ - 70 శాతం కట్టి టీవీ తీసుకెళ్లిపోవచ్చు!

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రాం’.

FOLLOW US: 
Share:

శాంసంగ్ శుక్రవారం ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ‘స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రాం’ అనే కొత్త స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాం కింద వినియోగదారులు శాంసంగ్ స్మార్ట్ టీవీలను వాటి ధరలో కేవలం 70 శాతం చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మిగతా 30 శాతాన్ని 12 నెలల తర్వాత చెల్లించవచ్చు. పెద్ద స్క్రీన్ ఉన్న ప్రీమియం శాంసంగ్ టీవీలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ, ది ఫ్రేమ్, క్రిస్టల్ క్యూహెచ్‌డీ లైనప్ ప్రీమియం టీవీలను వినియోగదారులు ఈ ప్రోగ్రాం కింద కొనుగోలు చేయవచ్చు.

ప్రీమియం శాంసంగ్ టీవీని కేవలం 70 శాతం చెల్లించి ఈ ‘స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రాం’ కింద కొనుగోలు చేయవచ్చు. మిగిలిన 30 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు శాంసంగ్ క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ టీవీని రూ.23,093 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మిగతా రూ.9,897ను 12 నెలల తర్వాత చెల్లించే ఆప్షన్ ఉంది. ఈ టీవీల్లో మోషన్ ఎక్స్‌సెలరేటర్ టర్బో టెక్నాలజీ స్మూత్ మోషన్, క్లియర్ ఇమేజెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యూనివర్సల్ గైడ్, గేమ్ మోడ్, పీసీ ఆన్ టీవీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కూడా అందించారు.

శాంసంగ్ ఫ్రేమ్ 2021 సిరీస్ క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ (4కే) స్మార్ట్ టీవీని రూ.38,493 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగతా రూ.16,497ను 12 నెలల తర్వాత చెల్లించవచ్చు. ఇందులో వినియోగదారులకు వేర్వేరు కస్టమైజేషన్ ఆప్షన్లు, డిఫరెంట్ కలర్డ్ బెజెల్స్ ఉండనున్నాయి. ఈ ఫ్రేమ్ సిరీస్‌లో పవర్‌ఫుల్ క్వాంటం ప్రాసెసర్ 4కే, 4కే ఏఐ అప్‌స్కేలింగ్ ఫీచర్లు అందించారు.

శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే రేంజ్ టీవీలు మనదేశంలో ఏప్రిల్‌లో లాంచ్ అయ్యాయి. వీటిలో ఇన్ బిల్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) హబ్ ఉంది. దీని ద్వారా స్మార్ట్ హోం డివైసెస్‌ను కంట్రోల్ చేయవచ్చు. మోషన్ ఎక్స్‌సెలరేటర్ టర్బో ప్రో టెక్నాలజీ ఉంది. దీని ద్వారా ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ లభించనుంది. శాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ కింద 45 ఉచిత ఇండియన్, గ్లోబల్ టీవీ చానెల్స్‌ను చూడవచ్చు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 01 Jul 2022 08:31 PM (IST) Tags: Samsung Smart Upgrade Program Flipkart Smart Upgrade Program Smart Upgrade Program Samsung TV Offers

ఇవి కూడా చూడండి

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Redmi Smart Fire TV 4K: కొత్త 4కే ఫైర్ టీవీ లాంచ్ చేసిన రెడ్‌మీ - ధర ఎంత ఉంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Redmi Smart Fire TV 4K: కొత్త 4కే ఫైర్ టీవీ లాంచ్ చేసిన రెడ్‌మీ - ధర ఎంత ఉంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Samsung Micro LED TV: కోటి రూపాయల టీవీని లాంచ్ చేసిన శాంసంగ్ - అంత స్పెషల్ ఏం ఉందబ్బా?

Samsung Micro LED TV: కోటి రూపాయల టీవీని లాంచ్ చేసిన శాంసంగ్ - అంత స్పెషల్ ఏం ఉందబ్బా?

రూ.14 వేలలోపే షావోమీ స్మార్ట్ టీవీ లాంచ్ - ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలు కూడా!

రూ.14 వేలలోపే షావోమీ స్మార్ట్ టీవీ లాంచ్ - ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలు కూడా!

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Chandrababu Naidu Arrest :  బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ  -   కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం

Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ