Telecom Reforms in Aadhaar: కొత్త సిమ్ కనెక్షన్ కోసం ఇక స్టోర్లకు వెళ్లక్కర్లేదు.. ఇంటి వద్దనే కేవైసీ పూర్తి చేయవచ్చు... అదెలా అంటే...
కొత్త మొబైల్ కనెక్షన్(సిమ్ కార్డు) పొందేందుకు కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. ఇందుకు టెలికాం సంస్థల స్టోర్లకు వెళ్లాల్సి ఉండేది. కానీ కేంద్రం తాజా మార్గదర్శకాలతో ఇంటి వద్దనే కేవైసీ పూర్తి చేయవచ్చు.
సామాన్యులకు కూడా ప్రపంచస్థాయి ఇంటర్నెట్, టెలి కనెక్టివిటీ సర్వీసులు అందించడమే లక్ష్యంగా టెలికాం సంస్కరణలు తీసుకువస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఓ ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ విభావం, కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ తరఫున కేవైసీ ప్రక్రియ సరళీకృతంపై ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 15న కేబినేట్ ప్రకటించిన టెలికాం సంస్కరణల మేరకు ఈ ఆదేశాలు జారీచేసింది.
Also Read: Money Management Tips: ఉద్యోగులూ..! డబ్బు మిగుల్చుకొనేందుకు 11 బంగారు సూత్రాలివి
ఎలక్ట్రానిక్ విధానానికి గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం కొత్త మొబైల్ కనెక్షన్(సిమ్) కోసం వినియోగదారుడు ఒరిజినల్ డాక్యుమెంట్లతో టెలికాం సంస్థల అవుట్ లెట్లకు వెళ్లాల్సి ఉంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇది తప్పనిసరి. కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్రం తాజా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మూడు విధానాలు అమలుచేయబోతుంది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ సర్వీస్ డెలివరీకి ప్రజలు ఆసక్తి చూరపుతున్నారు. ఓటీపీ ఆధారంగా చాలా సంస్థలు ఇంటర్నెట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా కాంటాక్ట్‌లెస్ సేవలు పొందేందుకు చందాదారుల ఆసక్తి చూపుతున్నారు. ఓటీపీ ఆధారిత సేవల వల్ల వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం సాధ్యమౌతుంది. యూజర్ ఆధార్ వివరాలు, ఇతర సమాచారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో వినియోగించుకోవాల్సి వస్తే ముందుగా యూజర్ సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ తాజా మార్గదర్శకాలు ప్రకారం కాంటాక్ట్‌లెస్, కస్టమర్ సెంట్రిక్, సెక్యూర్డ్ కేవైసీ విధానాన్ని అమలుచేస్తుంది.
Department of Telecommunications, GoI, today issued a series of orders simplifying the KYC processes and thereby initiating the telecom reforms in Aadhaar based e-KYC, Self-KYC and OTP based conversion of mobile connection from Prepaid to Postpaid and vice-versa. pic.twitter.com/XsG3fbPsJF
— ANI (@ANI) September 21, 2021
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ
కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియ తిరిగి ప్రవేశపెట్టారు. కస్టమర్ల సమాచారం పొందేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి కస్టమరుకు రూ.1 యూఐడీఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా పేపర్‌లెస్ డిజిటల్ ప్రక్రియ. దీనిలో వినియోగదారుడి ఫొటోతో పాటు వివరాలను యూఐడీఏఐ నుంచి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆన్‌లైన్‌లో పొందుతాయి.
Also Read: Online Payment: మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తారా? త్వరలో కొత్త రూల్ ఇదే..
యాప్ లేదా పోర్టల్ ద్వారా కేవైసీ
ఈ ప్రక్రియలో వినియోగదారులు నూతన మొబైల్ కనెక్షన్(సిమ్) కోసం యాప్ లేదా పోర్టల్ ఆధారిత ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పొందవచ్చు. కస్టమర్ ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చొని మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. UIDAI లేదా డిజిలాకర్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో పత్రాలు ధ్రువీకరించి ఇంటి వద్దే SIM పొందవచ్చు.
Also Read: Flying Car : మేడిన్ చెన్నై బ్రాండ్ ఎగిరే కారు ! రిలీజ్ ఎప్పుడు అంటే...?
ప్రీపెయిడ్ టు పోస్ట్ పెయిడ్ మారేందుకు
OTP ఆధారితంగా వినియోగదారుడు తన మొబైల్ కనెక్షన్‌ని ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కి అలాగే పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఇంట్లో నుంచే OTP ఆధారితంగా కేవైసీ చేసుకోవచ్చు.
Also Read: Online Payment: మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తారా? త్వరలో కొత్త రూల్ ఇదే..