Tecno Pova Neo Launched: 11 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర రూ.13 వేలలోపే.. అదిరిపోయే ఫోన్ వచ్చేసింది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే టెక్నో పోవా నియో. దీని ధర రూ.12,999గా ఉంది.
టెక్నో పోవా నియో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 6 జీబీ ర్యామ్ ఉంది. దీన్ని ఎక్స్‌ప్యాండబుల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా మరో 5 జీబీ పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 11 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట.
టెక్నో పోవా నియో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. గీక్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జనవరి 22వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,499 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా లభించనున్నాయి.
టెక్నో పోవా నియో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా నియో పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 84.8 శాతంగానూ ఉంది. హోల్ పంచ్ డిస్‌ప్లేను కూడా ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. టెక్నో పోవా నియోలో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. వెనకవైపు కెమెరాలకు క్వాడ్ ఫ్లాష్, ముందువైపు డ్యూయల్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంది..
బ్లూటూత్, వైఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, ఎఫ్ఎం రేడియో, ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. జీ-సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది. దీని మందం 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!