Tecno Pop 5S: టెక్నో పాప్ 5ఎస్ వచ్చేసింది.. రూ.6 వేలలోపే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ ఫోన్ పాప్ 5ఎస్‌ను లాంచ్ చేసింది.
టెక్నో పాప్ 5ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. టెక్నో పాప్ 5 సిరీస్‌లో ఈ సంవత్సరం ఇప్పటికే మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవే టెక్నో పాప్ 5ఎక్స్, టెక్నో పాప్ 5, టెక్నో పాప్ 5 ప్రో. ఇప్పుడు లాంచ్ కానున్న టెక్నో పాప్ 5ఎస్ నాలుగో ఫోన్ కానుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతానికి మెక్సికోలో మాత్రమే లాంచ్ అయింది.
టెక్నో పాప్ 5ఎస్ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. టెక్నో పాప్ 5ఎస్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే మనదేశంలో రూ.6 వేలలోపే దీని ధర ఉండే అవకాశం ఉంది.
టెక్నో పాప్ 5ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 5.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉండనుంది. ఇందులో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 5 మెగాపిక్సెల్ కాగా.. క్యూవీజీఏ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3020 ఎంఏహెచ్‌గా ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్‌లను కూడా ఇందులో అందించారు. మైక్రో యూఎస్‌బీ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేయవచ్చు. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా.. బరువు 160 గ్రాములుగా ఉండనుంది.
View this post on Instagram