By: ABP Desam | Updated at : 11 Feb 2023 04:06 PM (IST)
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ లాంచ్ అయింది.
Samsung Galaxy S23 Ultra BMW M Edition: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఫిబ్రవరి 1వ తేదీన లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ Samsung Galaxy S23 Ultra. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇంతలో శాంసంగ్ తన ఎస్23 అల్ట్రా మోడల్‌లో కొత్త ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి Samsung Galaxy S23 Ultra BMW M Edition అని పేరు పెట్టారు.
ఈ బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ కోసం బీఎండబ్ల్యూ. SK టెలికామ్‌తో కలిసి శాంసంగ్ పనిచేసింది. ఈ కొత్త ఎడిషన్ దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇందులో కేవలం 1000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంటే 1,000 మంది మాత్రమే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయగలరన్న మాట.
ధర ఎంత?
Samsung Galaxy S23 Ultra BMW M ఎడిషన్ ఫాంటమ్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. దీని ధర రూ.1,12,960గా నిర్ణయించినట్లు సమాచారం. ఇది భారతదేశంలోని సాధారణ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ కంటే కూడా తక్కువ.
బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్‌లో తేడా ఏమిటి?
దీని ప్యాకేజింగ్ సాధారణ ఎస్23 అల్ట్రా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో, మీరు BMW కీ రింగ్, ఆరు విభిన్న BMW లోగోలు, BMW రౌండల్‌ను పొందుతారు. కంపెనీ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దీనిని పరిచయం చేసింది. అదనంగా మీరు ఎయిర్ కంప్రెసర్, 'వి ఆర్ ఎమ్' మెటల్ లోగో, కప్ హోల్డర్/వైర్‌లెస్ ఛార్జర్, గడియారం, ఫోటో బుక్, పోస్టర్‌ను కూడా పొందుతారు. దీంతో పాటు కొంతమంది అదృష్ట కస్టమర్లకు దక్షిణ కొరియాలోని బీఎండబ్ల్యూ డ్రైవింగ్ సెంటర్‌కు కంపెనీ స్టార్టర్ ప్యాక్ వోచర్‌ను కూడా అందిస్తుంది.
మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్ సాధారణ Samsung Galaxy S23 Ultra మాదిరిగానే ఉండవచ్చు. మీరు BMW M ఎడిషన్‌లో మూడు విభిన్న రకాల బూట్ యానిమేషన్‌లను చూస్తారు. అంటే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఈ ఎడిషన్ లో విభిన్నమైన యానిమేషన్ కనిపిస్తుంది.
రియల్‌మీ 10 ప్రో కోకా కోలా ఎడిషన్ వచ్చేసింది
Realme 10 Pro 5G కోకా కోలా ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ అయిన Realme 10 Pro 5G లాగా ఉంటుంది. వాస్తవానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం విడుదల చేసింది. కంపెనీ కోకా-కోలాతో కలిసి పని చేసినందున, దీని కారణంగా రియల్‌మీ ఈ ఫోన్‌ను మరోసారి కొత్త డిజైన్‌లో లాంచ్ చేసింది. Realme ఈ కొత్త ఫోన్ ధరను రూ.20,999గా నిర్ణయించింది. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, రియల్ మీ స్టోర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోలు చేయగలుగుతారు.
C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్