News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samsung M33 5G: 6000 ఎంఏహెచ్‌తో రానున్న శాంసంగ్ 5జీ ఫోన్.. ఫీచర్లు కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ గెలాక్సీ ఎం33 5జీని త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో లాంచ్ అయిన గెలాక్సీ ఎం32 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

దీనికి సంబంధించిన లీకులు మొదటిసారి అక్టోబర్‌లోనే బయటకు వచ్చాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. బడ్జెట్ 5జీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

శామ్‌మొబైల్ కథనం ప్రకారం.. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీలో అందించనున్న బ్యాటరీ మోడల్ నంబర్ EB-BM336ABNగా ఉండనుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఎంత ఉండనుందనే సంగతి మాత్రం తెలియరాలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీనికి సంబంధించిన 4జీ వేరియంట్‌లో మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీనే అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను ఎం33 5జీ అందించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీలో ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ కానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ కానున్న లో కాస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటిగా ఉండనుంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Dec 2021 11:24 PM (IST) Tags: samsung Samsung New 5G Phone Samsung Galaxy M33 5G Samsung M33 5G Samsung Galaxy M33 5G Launch Samsung M33 5G Specifications Leaked

ఇవి కూడా చూడండి

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Hyderabad News: హైదదరాబా లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ - 13, 300 మందికి పట్టాల అందజేత

Hyderabad News: హైదదరాబా లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ - 13, 300 మందికి పట్టాల అందజేత

Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి

Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి

WhatsApp New Feature: పేయూ, రేజర్‌పేతో వాట్సాప్‌ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్‌

WhatsApp New Feature: పేయూ, రేజర్‌పేతో వాట్సాప్‌ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్‌

YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్