Samsung Galaxy M05: రూ.8 వేలలోపే శాంసంగ్ గెలాక్సీ ఎం05 - 50 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీతో!
Samsung New Phone: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం05.
Samsung Galaxy M05 Launched: శాంసంగ్ గెలాక్సీ ఎం05 స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. శాంసంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. గత సంవత్సరం లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం04కు తర్వాతి వెర్షన్‌గా శాంసంగ్ గెలాక్సీ ఎం05 మార్కెట్లోకి వచ్చింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం05 ధర (Samsung Galaxy M05 Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.7,999గా నిర్ణయించారు. మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అమెజాన్, శాంసంగ్.కాం, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ ఎం05 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy M05 Specifications)
శాంసంగ్ గెలాక్సీ ఎం05 స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్ఎల్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. శాంసంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే ఇందులో 8 జీబీ వరకు ర్యామ్ ఉందనుకోవచ్చన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా రానున్నాయి. శాంసంగ్ ఇటీవలే మంచి లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో మంచి ఏఐ ఫీచర్లను కూడా తీసుకువచ్చింది. ఆ ఫీచర్లు ఇందులో ఉంటాయో లేదో తెలియరాలేదు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Who will be the next cover app? Discover the superpowers for creating more creative and playful cover shots with Galaxy AI!
— Samsung India (@SamsungIndia) September 13, 2024
Try the latest Galaxy: https://t.co/HMf46nn1Wv.
Know more how to switch to Galaxy: https://t.co/O6AXLyPbEB.#GalaxyZFold6 #GalaxyZFlip6 #GalaxyAI #Samsung pic.twitter.com/ZQ8GhREyd9