Samsung A03: రూ.10 వేలలోనే శాంసంగ్ కొత్త ఫోన్ - మనదేశంలో లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీని ధర ఆన్‌లైన్‌లో లీకైంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ధర మనదేశంలో లీకైంది. ఈ ఫోన్ గతేడాది నవంబర్‌లో వియత్నాంలో లాంచ్ అయింది. ఈ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ ఇప్పుడు మనదేశంలో మిడ్‌రేంజ్ విభాగంలో లాంచ్ కానుంది. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. ఇందులో యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 భారతదేశపు ధర (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ మైస్మార్ట్‌ప్రైస్ భాగస్వామ్యంతో దీని ధరను లీక్ చేశారు. ఈ కథనం ప్రకారం... ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా ఉండనుంది. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించనున్నారు.అయితే శాంసంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్ ఇటీవలే వియత్నాంలో లాంచ్ అయింది. గతంలో వచ్చిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ మనదేశంలో మార్చిలో నెల ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ03 పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు రెండు కెమెరాలను ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ముందువైపు ఉన్న వాటర్ డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించారు. వాల్యూమ్ రాకర్లు ఫోన్ ఎడమవైపు ఉన్నాయి. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వివరాలను కంపెనీ ప్రకటించలేదు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!