Jio 198 Plan: రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Jio Best Prepaid Plan: ప్రముఖ టెలికాం బ్రాండ్ జియో మనదేశంలో రూ.198 అన్‌లిమిటెడ్ 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. జియో అందిస్తున్న అత్యంత చవకైన అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఇదే.
Jio Rs 198 Plan: రిలయన్స్ జియో సైలెంట్‌గా మనదేశంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇప్పటివరకు జియో అందిస్తున్న అత్యంత చవకైన 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే కావడం విశేషం. అదే జియో రూ.198 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో క్లౌడ్‌లకు యాక్సెస్ కూడా లభించనుంది. రిలయన్స్ జియో ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరను పెంచిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ జియో రూ.198 ప్లాన్ లాభాలు
రిలయన్స్ జియో రూ.198 ప్లాన్ ఇప్పటికే రిలయన్స్ జియో వెబ్ సైట్లో లైవ్ అయింది. కంపెనీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్లలో అన్నిటికంటే కింద దీన్ని ఉంచారు. ఇప్పటివరకు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్లలో రూ.349 ప్లానే అత్యంత చవకైనది. ఇప్పుడు అందిస్తున్న జియో ప్లాన్ ద్వారా రోజూ 2 జీబీ 4జీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులు మాత్రమే.
మిగతా ప్లాన్ల లాగానే ఈ ప్లాన్‌లో కూడా 4జీ డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. ఒకవేళ మీరు 5జీ సిగ్నల్ వచ్చే ప్రాంతంలో డేటాతో పాటు రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దీంతోపాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి యాప్స్‌కు యాక్సెస్ లభించనుంది. అయితే జియో సినిమా ప్రీమియం కావాలంటే మాత్రం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. రిలయన్స్ జియో కొత్త ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. అంటే 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లలో సగం అన్నమాట. మిగతా లాభాలన్నీ దాదాపు రూ.349 ప్లాన్ తరహాలోనే ఉంటాయి.
రిలయన్స్ జియోకు ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ వద్ద కూడా ఇలాంటి ప్లాన్ ఏమీ లేదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ధర రూ.379గా ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ 4జీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభించనుంది. ఎక్స్‌ట్రీమ్ ప్లే, వింక్, హలో ట్యూన్స్‌కు కూడా ఫ్రీ యాక్సెస్ లభించింది.
From isolation to inspiration - the people of Guttulaputtu, a tribal village in Andhra Pradesh now thrives with high-speed internet and digital services.
— Reliance Jio (@reliancejio) August 21, 2024
Guttulaputtu #OnJio#WithLoveFromJio #DigitalIndia #India pic.twitter.com/9C8YQRh76X
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Life's more entertaining when you experience it with a sibling. 💙
— Reliance Jio (@reliancejio) August 19, 2024
Here's to all the siblings who connect you to unlimited moments of joy and laughter. 🫶🏻
Happy #Rakshabandhan #WithLoveFromJio #Nostalgia #Siblings #JioAirFiber pic.twitter.com/17VKPFmokL