Redmi Watch 2: రూ.ఐదు వేలలోనే స్మార్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ చేసిన రెడ్‌మీ!
రెడ్‌మీ కొత్త స్మార్ట్ వాచ్‌ని లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ వాచ్ 2. దీని ధర రూ.ఐదు వేలలోపే ఉంది.
రెడ్‌మీ వాచ్ 2 స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ వాచ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. ఇందులో 12 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించే బ్యాటరీ ఉంది. అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా ఇందులో అందించారు. 100కు పైగా వాచ్ ఫేసెస్‌ను ఇందులో అందించారు.
రెడ్‌మీ వాచ్ 2 ధర
దీని ధరను చైనాలో 399 యువాన్లుగా(సుమారు రూ.4,700) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, ఇవోరీ డయల్ కలర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్రౌన్, ఆలివ్, పింక్ స్ట్రాప్ షేడ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
రెడ్‌మీ వాచ్ 2 స్పెసిఫికేషన్లు
ఇందులో 1.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 63.7 శాతంగా ఉంది. దీని అంచులు చాలా సన్నగా ఉన్నాయి. ఇందులో 100 వాచ్ ఫేసెస్ వరకు ఉన్నాయి. ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే సపోర్ట్ కూడా ఈ వాచ్‌లో అందించారు. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ ట్రాకింగ్, స్లీప్ అనాలసిస్ కూడా అందించారు. జీపీఎస్ గ్లోనాస్, గెలీలియో, బైదు వంటి వాటిని కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది.
ఈ వాచ్‌లో మొత్తం 117 ఫిట్‌నెస్ మోడ్స్ అందించారు. 17 ప్రొఫెషనల్ వర్కవుట్ టైప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, షియోఏఐ అసిస్టెంట్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా స్మార్ట్ కంట్రోల్స్ చేసుకోవచ్చు.
ఇందులో తక్కువ పవర్‌ను తీసుకునే చిప్‌సెట్‌ను అందించారు. దీంతోపాటు కొత్త బ్యాటరీ మేనేజ్‌మెంట్ అల్గారిధం ద్వారా ఒక్కసారి చార్జ్ చేస్తే.. 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని కంపెనీ అంటోంది. దీంతో కొత్త మ్యాగ్నటిక్ చార్జర్, 5ఏటీయం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
Also Read: Apple Macbook Pro(2021): కొత్త మ్యాక్‌బుక్ ప్రోల సేల్ వాయిదా.. ఎప్పుడు కొనేయచ్చంటే?
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!