అన్వేషించండి

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన రెడ్‌మీ నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

రెడ్‌మీ నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

రెడ్‌మీ నోట్ 12 టర్బో ధర
ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,900) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగానూ (సుమారు రూ.26,300), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగానూ (సుమారు రూ.28,700) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.33,400) ఉంది.

క్సిన్‌గాయ్ బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన హ్యారీ పోటర్ వెర్షన్ కూడా విడుదల అయింది.

రెడ్‌మీ నోట్ 12 టర్బో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్‌గా ఉండటం విశేషం.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 12 టర్బో పని చేయనుంది. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా ధ్రువీకరించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ గతేడాది మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ‌్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే శాంసంగ్ ఏ53 5జీతో పోటీ పడనుంది.

ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,699 యువాన్లుగా (సుమారు రూ.19,300) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగా (సుమారు రూ.20,400), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.22,700) ఉంది. మిడ్‌నైట్ డార్క్, టైమ్ బ్లూ, మిర్రర్ పోర్స్‌లెయిన్ వైట్, షాలో డ్రీమ్ గెలాక్సీ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
IPL 2025 MI VS SRH Update: పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది?  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget