అన్వేషించండి

Redmi Note 11: రెడ్‌మీ నోట్ 11 ఫోన్లు వచ్చేశాయ్, రూ.13 వేల నుంచే, అదిరిపోయే డిస్‌ప్లే, సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. అవే రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్.

భారతదేశ నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవే రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్. వీటిలో రెడ్‌మీ నోట్ 11ఎస్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో అందించిన ర్యామ్ బూస్టర్ అనే ఫీచర్ ద్వారా 11 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. రెడ్‌మీ నోట్ 11లో 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. రియల్‌మీ 9ఐ, ఇన్‌ఫీనిక్స్ నోట్ 11ఎస్, మోటో జీ51లతో రెడ్‌మీ నోట్ 11 పోటీ పడనుంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ మాత్రం రియల్‌మీ నార్జో 30 ప్రో, ఇన్‌ఫీనిక్స్ నోట్ 10 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం32లతో పోటీ పడనుంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న 108 మెగాపిక్సెల్ కెమెరాల్లో రెడ్‌మీ నోట్ 11ఎస్ అత్యంత చవకైనది.

రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499గానూ ఉంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది.

రెడ్‌మీ నోట్ 11 ధర
ఇందులో కూడా మూడు వేరియంట్లే ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జరగనుంది. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ దీనిపై కూడా లభించనుంది.

రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫీచర్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. ర్యామ్‌ను మరో 3 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్‌తో మొత్తంగా 11 జీబీ ర్యామ్‌ను (వర్చువల్ ర్యామ్‌తో కలిపి) పొందవచ్చన్న మాట.

రెడ్‌మీ నోట్ 11ఎస్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ప్రో ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.

రెడ్‌మీ నోట్ 11 ఫీచర్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. 

రెడ్‌మీ నోట్ 11 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఈ ఫోన్ మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మిగతా కనెక్టివిటీ ఫీచర్లన్నీ రెడ్‌మీ నోట్ 11ఎస్ తరహాలోనే ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget