Realme TechLife Washing Machines: రూ.11 వేలలోపే రియల్‌మీ వాషింగ్ మెషీన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.10,990 నుంచి ప్రారంభం కానుంది.
రియల్‌మీ తన టెక్‌లైఫ్ రేంజ్‌లో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. వీటిలో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, శక్తివంతమైన హోం అప్లయన్సెస్‌కు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. దీంతో రియల్‌మీ వాషింగ్ మెషీన్ల రంగంలోకి కూడా దిగింది.
ఈ కొత్త సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు 8, 8.5 కేజీల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.10,990 నుంచి ప్రారంభం కానుంది. సెమీ ఆటోమేటిక్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో ఎక్కువ కెపాసిటీ అందించారు. జెట్ స్ట్రీమ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ కూడా వీటికి ఉంది.
వీటిని భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటిలో 1,400 ఆర్‌పీఎం స్పిన్ సైకిల్, ఎయిర్ డ్రై టెక్నాలజీ, హార్డ్ వాటర్ వాష్, కాలర్ స్క్రబ్బర్, పల్సేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ వాషింగ్ మెషీన్ అవుటర్ బాడీని డ్యూరబుల్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. కాబట్టి తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇందులో హెవీ డ్యూటీ మోటార్‌ను అందించారు.
రియల్‌మీ జీటీ 2 ప్రో, 4కే టీవీ స్మార్ట్ టీవీ స్టిక్ మనదేశంలో ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ కానున్నాయి. రియల్‌మీ జీటీ 2 ప్రోలో 6.7 అంగుళాల ఎల్టీపీవో ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ క్వాడ్ హెచ్‌డీ+గా ఉండనుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 1400 నిట్స్‌గా ఉండనుంది.
1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో టీసీవో సర్టిఫికేషన్ అందించారు. ఈ సర్టిఫికెట్ ఉన్న ఫోన్ల జీవితకాలం ఎక్కువ ఉంటుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Presenting the #realmeTechLife Semi Automatic Washing Machine in the 8 & 8.5kg variants.
— realme TechLife (@realmeTechLife) March 24, 2022
Make laundry time convenient & super effective with its wide range of features!
Starting at ₹10,990
Available on @Flipkart.
Buy now: https://t.co/5qIaVllhdg pic.twitter.com/flSDLBy0vn