By: ABP Desam | Updated at : 26 May 2022 05:13 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ లాంచ్ అయింది.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో 11 అంగుళాల 2కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8,340 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ప్యాడ్‌లో ఉండనుంది. మ్యాగ్నటిక్ స్టైలస్, స్మార్ట్ కీబోర్డులను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ధర
ఈ ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,000) ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,400) నిర్ణయించారు. బ్రైట్ గ్రీన్ చెస్ బోర్డ్, సీ సాల్ట్ బ్లూ, స్టార్ గ్రే రంగుల్లో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు. ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.
128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను అందించారు. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?