Realme Note 60: రూ.ఎనిమిది వేలలోపే రియల్‌మీ నోట్ 60 - స్పెషల్ ఫీచర్లు ఇవే!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నోట్ 60. ఈ ఫోన్ ధర మనదేశ కరెన్సీలో రూ.7,500 ధరలో లాంచ్ అయింది.
Realme Note 60 Launched: రియల్‌మీ నోట్ 60 స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. రెండు కలర్ ఆప్షన్లు, మూడు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ వరకు స్టోరేజ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. రియల్‌మీ మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ ఇందులో ఉండనుంది. రియల్‌మీ నోట్ 50 తరహాలోనే దీని ఫీచర్లు ఉండనున్నాయి.
రియల్‌మీ నోట్ 60 ధర (Realme Note 60 Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,99,000 ఇండోనేషియా రూపాయలుగా (మనదేశ కరెన్సీలో రూ.7,500) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 15,99,000 ఇండోనేషియా రూపాయలుగానూ (మనదేశ కరెన్సీలో రూ.8,500), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 18,99,000 ఇండోనేషియా రూపాయలుగానూ (మనదేశ కరెన్సీలో రూ.10,000) ఉంది. మార్బుల్ బ్లాక్, వాయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు. ఒకవేళ లాంచ్ అయితే ఇండోనేషియాలో ఏ ధరతో అయితే ఎంట్రీ ఇచ్చిందో మనదేశంలో కూడా అదే ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రియల్‌మీ నోట్ 60 స్పెసిఫికేషన్లు (Realme Note 60 Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో ఉన్న మినీ క్యాప్యూల్ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్లు సెల్ఫీ కెమెరా దగ్గరే కనిపిస్తాయి. 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ వరకు, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్ వరకు ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా అందించారు.
రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీని కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని ద్వారా చేతులు తడిగా ఉన్నప్పటికీ ఫోన్ ఉపయోగించవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే