Realme Narzo 50 Launch: రూ.13 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 11 జీబీ వరకు ర్యామ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నార్జో 50. దీని ధర రూ.12,999 నుంచి ప్రారంభం కానుంది.
![Realme Narzo 50 Launch: రూ.13 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 11 జీబీ వరకు ర్యామ్! Realme Narzo 50 Launched in India Price Specifications Features All You Need to Know Realme Narzo 50 Launch: రూ.13 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 11 జీబీ వరకు ర్యామ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/df336446b850b1091af047874c626712_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ను అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.6 అంగుళాల డిస్‌ప్లే కూడా ఇందులో ఉండటం విశేషం. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ ఇందులో అందించింది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మీ ఫోన్‌లోని స్టోరేజ్‌ను కూడా ర్యామ్‌లా ఉపయోగించుకోవచ్చన్న మాట.
రియల్‌మీ నార్జో 50 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. స్పీడ్ బ్లాక్, స్పీడ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన సేల్ ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది. అమెజాన్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది.
రియల్‌మీ నార్జో 50 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై రియల్‌మీ నార్జో 50 పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. దీనికి తోడు డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 11 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)